Breaking News

Delhi Election: కేజ్రీవాల్‌ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’

Published on Wed, 01/22/2025 - 14:13

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎ‍న్నికలు జరగనున్నాయి. ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరపున ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టోలో ఆయన ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి  ఏడు ప్రధాన డిమాండ్లు చేశారు.

ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు మధ్యతరగతిని విస్మరించాయని, వారిని ప్రభుత్వానికి  ఉపయోగపడే ఒక ఏటీఎంగానే పరిగణించాయని కేజ్రీవాల్ విమర్శించారు. పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని, వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప్ తరపున ఆయన ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు.
 

ఆప్ ఏడు ప్రధాన డిమాండ్లు

1. పన్ను రహిత ఆరోగ్య బీమా: ఢిల్లీ పౌరులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమాను  అందించాలని, తద్వారా వైద్య చికిత్స కోసం ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం  ఉండదని ఆప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

2. సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స: సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలని పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

3. విద్యా హక్కులో మెరుగుదల: ఢిల్లీలో విద్యా స్థాయిని మరింత మెరుగుపరచడానికి సహాయం  అందించాలని ఆప్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

4. ఉపాధి -ఉద్యోగ భద్రత: ఢిల్లీలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రతను పెంచాలని పార్టీ డిమాండ్ చేసింది.

5. శరళమైన పన్ను విధానం: మధ్యతరగతి వారికి అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కలిగించేలా పన్ను విధానాన్ని మరింత శరళంగా మార్చాలని పార్టీ డిమాండ్ చేసింది.

6. ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల: ఢిల్లీలో నీరు, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం నుండి సహాయం కోరింది.

7. గృహనిర్మాణ పథకాలలో సహాయం: ఢిల్లీలోని పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలలో గృహనిర్మాణ పథకాలను అందించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది.

అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో  మాట్లాడుతూ ‘మా పార్టీ ఢిల్లీ ప్రజలకు అండగా నిలిచింది. అయితే మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. దీనిని మార్చడానికి, ఢిల్లీలోని అన్ని తరగతుల  గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.

Delhi Assembly Election: కేంద్రం ముందు 7 డిమాండ్లు పెట్టిన కేజ్రివాల్

ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి..
 

Videos

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)