Breaking News

ఎన్నికల వేళ ఆప్‌‎కు బిగ్ షాక్.. ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా

Published on Fri, 01/31/2025 - 17:55

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని ఏడుగురు ఆప్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.  ఎమ్మెల్యేలు నరేష్ యాదవ్ (మెహ్రౌలి), రోహిత్ కుమార్ (త్రిలోక్‌పురి), రాజేష్ రిషి (జనక్‌పురి), మదన్ లాల్ (కస్తూర్బా నగర్), పవన్ శర్మ (ఆదర్శ్ నగర్),  భావన గౌర్‌ (పాలం), బీఎస్‌ జూన్‌ (బిజ్వాసన్‌) పార్టీని వీడారు. ప్రస్తుత ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో రాజీనామా బాట పట్టారు.

జనక్‌పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేశారు. టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన రాజేష్ రిషి అరవింద్ కేజ్రీవాల్‌కు రాజీనామా లేఖ పంపారు. లేఖలో పార్టీ అవినీతిలో మునిగిపోయిందంటూ ఆరోపణలు గుప్పించారు. మీ పట్ల, పార్టీ పట్ల విశ్వాసం కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.. దయ చేసి నా రాజీనామాను ఆమోదించండి’ అంటూ భావనా గౌర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా రాజీనామా చేశారు. తొలుత ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఖురాన్‌ను అవమానించిన కేసులో యాదవ్‌కు పంజాబ్ కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో ఆయనకు ఈ ఎన్నికల్లో ఆప్.. టికెట్ నిరాకరించింది. మరో ఐదు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, గెలుపే లక్ష్యంగా అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. హామీల వర్షం గుప్పిస్తూ.. ప్రచారాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం.. ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగలినట్లయింది.

ఇదీ చదవండి: రాష్ట్రపతిపై సోనియా వివాదాస్పద వ్యాఖ్యలు

కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. నిన్న(గురువారం) మీడియాతో మాట్లాడుతూ, యమునా నదిని హరియాణా ప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్‌ కుమార్‌ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్‌ కుమార్‌ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు.

 

 

 

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)