Breaking News

రికార్డులు బద్దలు కొట్టిన శ్రీనగర్‌, బారాముల్లా ఓటర్లు

Published on Tue, 05/21/2024 - 09:46

దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఐదు దశల ఓటింగ్‌ పూర్తయ్యింది. ఇంకా రెండు దశల పోలింగ్‌ మిగిలివుంది. ఐదవ దశ ఓటింగ్‌లో జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో  రికార్డు స్థాయి ఓటింగ్‌ నమోదయ్యింది.

సోమవారం జరిగిన పోలింగ్‌లో బారాముల్లాలో 59 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది 1984 తర్వాత అత్యధికం. కేంద్రపాలిత ప్రాంత ప్రధాన ఎన్నికల అధికారి పీకె పాల్ ఈ వివరాలను తెలిపారు. 1967లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు బారాముల్లా లోక్ సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైందన్నారు. 1984లో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 58.90 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి ఇది 59శాతంగా ఉంది. ఈ లోక్‌సభ స్థానంలో మొత్తం 17,37,865 మంది ఓటర్లు ఉన్నారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలోని 2,103 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరిగింది. 2019లో ఈ నియోజకవర్గంలో 34.6 శాతం ఓటింగ్ జరగగా, 1989లో అది 5.48 శాతం మాత్రమే ఉంది.

దీనికి ముందు నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 1996 తర్వాత అత్యధికం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇవే మొదటి సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడి ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు జమ్మూ కశ్మీర్ ఓటర్లకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)