Breaking News

'నీ భార్య నిన్ను వ‌దిలి వెళ్లిపోతుంది'

Published on Sat, 07/05/2025 - 13:58

'అమెరికాతో మీకేం సంబంధం ఉంది. భారత దేశానికి తిరిగి వెళ్లిపోయి ముంబై, గుజ‌రాత్‌ల‌తో సంబ‌రాలు చేసుకోండి. మీ భార్య మిమ్మ‌ల్ని వదిలేస్తుంది' అంటూ భారత సంత‌తికి చెందిన‌ రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామిపై అమెరిక‌న్లు విరుచుకుప‌డుతున్నారు. వివేక్ రామస్వామిపై అమెరిక‌న్లు జాత్యాహంకార వ్యాఖ్య‌లు చేయ‌డం కొత్తేమీ కాదు. ఒహియో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న ఆయ‌నపై సోష‌ల్ మీడియా వేదిక‌గా అమెరికా పౌరులు విద్వేషం వెళ్ల‌గ‌క్కుతున్నారు. తాజాగా ఎక్స్‌లో షేర్ చేసిన ఫొటోపై తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

జాతి విద్వేష వ్యాఖ్య‌లతో ట్రోలింగ్
జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్భంగా భార్యా, పిల్ల‌ల‌తో దిగిన ఫొటోను వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'చిన్న పిల్లలు ప్రతి సంవత్సరం పెద్దవుతున్నారు. హ్యాపీ ఫోర్త్!' అంటూ క్యాప్ష‌న్ జోడించారు. దీనిపై అమెరిక‌న్లు జాతి విద్వేష వ్యాఖ్య‌లతో ఆయ‌న‌ను ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు మీ కుటుంబంతో గుజరాత్ లేదా ముంబైలో జరుపుకోవాలి' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'మీరు ఫ్రీడమ్ ఫ్రైస్‌ని, యాంకర్ బేబీ పౌరసత్వాన్ని తిరిగి పొందారా' అంటూ మ‌రొక‌రు ప్ర‌శ్నించారు.

ఒక‌రైతే వివేక్ రామస్వామి భార్య ఆయ‌న‌ను వ‌దిలి వెళ్లిపోతుందంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. 'ట్రంప్ పాలనలో మీ కుటుంబం లేదా స్నేహితులు ఎవరైనా బహిష్కరించబడతారా అని నేను ఆశ్చర్యపోతున్నాను? బహుశా మీ భార్య కుటుంబ సభ్యులను బహిష్కరిస్తే ఆమె మిమ్మల్ని వదిలివేస్తుంది' అని మ‌రో అమెరిక‌న్ ట్రోల్ చేశారు.

అయితే వివేక్ రామస్వామిపై జాతి వివ‌క్ష వ్యాఖ్య‌లు కొత్తేం కాదు. మే నెల‌లో త‌మ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఎక్స్‌లో షేర్ చేసిన ఫొటో పైనా కూడా ఆయ‌న వ్య‌తిరేకులు ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. ఇండియాకు తిరిగి వెళ్లిపోవాంటూ తిట్టిపోశారు. వివేక్ స‌తీమ‌ణి డాక్ట‌ర్ అపూర్వ తివారి కూడా భార‌త సంతతికి చెందిన వారే. ఆమె కూడా అమెరికాలోనే జ‌న్మించారు. 

వివేక్ యాంకర్ బేబీనా? 
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిన తర్వాత వివేక్ రామస్వామిపై కొత్త ద్వేషం మొదలైంది. ట్రంప్ రెండోసారి అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు.. అమెరికాలో జన్మించిన ఎవరికైనా ఆటోమేటిక్‌గా పౌరసత్వం ద‌క్కేది. అయితే ఇది అందరికీ ఉద్దేశించింది కాదని, అందుకే ఈ నియమాన్ని మార్చాలనుకుంటున్నట్టు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఈ వివాదాస్ప‌ద నిర్ణ‌యాన్ని న్యాయ‌స్థానాల్లో స‌వాల్ చేయ‌డంతో దీని అమ‌లుపై సందిగ్దం కొనసాగుతోంది. 

చ‌ద‌వండి: ట్రంప్ మెగా బిల్లు.. ఎన్నారైల‌కు బిగ్ అల‌ర్ట్‌

మ‌రోవైపు వివేక్ రామస్వామిని యాంకర్ బేబీ  అంటూ అమెరిక‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సిన్సినాటిలో వివేక్ పుట్టేట‌ప్ప‌టికి ఆయ‌న‌ త‌ల్లికి అమెరికా పౌర‌స‌త్వం లేదు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. తాను పుట్టిన తర్వాత తన తల్లి పౌరసత్వ పరీక్ష రాసిందని, త‌న తండ్రి కూడా అప్ప‌టికి అమెరికా పౌరుడు కాదని ఒప్పుకున్నారు. అయితే త‌న తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చారని చెప్పారు. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన తల్లిదండ్రుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తించదని, వర్తించకూడదని తాను భావిస్తున్నట్టు గ‌తంలో వివేక్ రామ‌స్వామి అన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)