Breaking News

యుకెలో అంబరాన్నంటిన గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలు

Published on Tue, 02/06/2024 - 09:23

ఈ సంవత్సరం యుకెలో జరిగిన సంక్రాంతి సంబరాలు సుమారు 1300 మంది ఆహూతులతో లండన్ హారో లీజర్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత కొద్ది సంవత్సరాలుగా యుకెలో తెలుగువారు నిర్వహించుకునే వేడుకలలో గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక స్థానం ఉంది. గోదావరి రుచులకు, అక్కడి పిండివంటలకు, ఆప్యాయతలకు, ఆచారాలకు, సంస్కృతికి  ప్రాధాన్యతనిస్తూ భోగిపళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు, హరిదాసు, ముగ్గులు ఇంకా ఎన్నో పాటలు, నృత్యాలు, నృత్యరూపకాలు ఆద్యంతం అలరించాయి. 

సంబరానికి హాజరైన వారందరినీ పేరుపేరునా మర్యాదపూర్వక పిలుపులతో ఆహ్వానించి గ్రూప్ సభ్యులు తమదైన శైలిని చాటిచెప్పారు. అరిటాకులలో సహబంతి భోజనాలు, అన్నవరం ప్రసాదం, పనసపొట్టు పులావు, కొబ్బరన్నం, మామిడికాయ పనసగింజల కూర, పొన్నగంటి పప్పు, వంకాయ పకోడీ కూర, ములక్కాడ జీడిపప్పు కూర్మ, బెల్లం మాగాయి, మజ్జిగ పులుసు, ఉసిరికాయ చారు,

కంద ఆవకాయ, సొరకాయ రోటి పచ్చడి, గారెలు, పెరుగు చట్నీ, కోడి కూర, మటన్ ఫ్రై, రొయ్యల ఇగురు మొదలైన వివిధ రకాల వంటకాలను గోదారోళ్ళ గ్రూప్ సభ్యులు స్వయంగా వండి వడ్డించడం ఇందులో విశేషం. ఇవేకాక రాజమండ్రి రోజ్ మిల్క్, జున్ను వంటివి అందరినీ ఆశ్చర్యపరిచి కొస మెరుపుగా నిలిచాయి. 

ఈ వేడుకలకు హాజరైన వివిధ ప్రాంతాల వారు గోదారోళ్ళ  రుచులతో పాటు వారి సహకారాన్ని, వెటకారాన్ని, మమకారాన్ని మెచ్చుకోవడమే కాక అక్కడ నిర్వహించిన లక్కీడ్రాలో బంగారం, వెండి మొదలైన బహుమతులను గెలుచుకొన్నారు. జంతికలు, మైసూరుపాకు మరియు కరకజ్జంతో కూడిన సారెను అందరికీ పంచడంతో  ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి.
 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)