Breaking News

భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్

Published on Fri, 01/03/2025 - 15:41

తెలుగు సంస్కృతి, సంప్రదాయలను పరిరక్షించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి నెల తెలుగు లలిత కళా వేదిక ద్వారా అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనంపై నాట్స్ వెబినార్ నిర్వహించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు పారుపల్లి శ్రీరంగనాథ్ ఈ వెబినార్‌కు విచ్చేశారు. తిరుమలేశుడి గోవింద నామాలతో ప్రతి తెలుగు ఇంటికి ఆయన గాత్రం సుపరిచితమైంది. 

గోవింద నామాలతో పాటు ఆ వెంకటేశ్వరుడి అనేక భక్తిగీతాలను ఆయన ఆలపించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దేవాలయంలో ఆయన పాడిన భక్తి పాటలు మారుమ్రోగుతుంటాయి. భక్తి గీతాల ఆలాపనకు చిరునామాగా మారిన పారుపల్లి శ్రీరంగనాథ్ నాట్స్ వెబినార్‌లో పాలుపంచుకోవడాన్ని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి ప్రశంసించారు. గోవింద నామాలు పాడే అవకాశం ఎలా వచ్చింది.? తిరుమల దేవస్థానం ఆస్థాన గాయకుడిగా ఎలా స్థానం లభించింది ఇలాంటి అంశాలను శ్రీ రంగనాథ్ వివరించారు. 

గోవింద నామాలు పాడి వినిపించారు. ఆ తిరుమలేశుడికి అత్యంత ఇష్టమైన అన్నమయ్య సంకీర్తనలు పాడటంతో పాటు వాటి అర్థాలను కూడా ఆయన వివరించారు. తాను స్వరపరిచిన భక్తిగీతాలు, ఆధ్యాత్మిక రంగంలో భక్తులను భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్లేందుకు భక్తిపాటల ద్వారా చేస్తున్న కృషిని రంగనాథ్ ఈ వెబినార్ ద్వారా అందరికి తెలిపారు. అలాగే అన్నమయ్య సంకీర్తనల పరమార్థం గురించి, వెబినార్‌లో పాల్గొన్న వారు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం ఇచ్చారు. 

ఈ కార్యక్రమానికి నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి( మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల అనుసంధానకర్తగా వ్యవహరించారు. లలిత కళా వేదిక సభ్యుడు గిరి కంభమ్మెట్టు, నేషనల్ కోఆర్డినేటర్ (విమెన్ ఎంపవర్మెంట్) రాజలక్ష్మి చిలుకూరి, నేషనల్ కోఆర్డినేటర్ (మార్కెటింగ్) కిరణ్ మందాడి, పలువురు నాట్స్ సభ్యులు, తెలుగువారు ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: సింగపూర్ దక్షిణ భారత బ్రాహ్మణ సభ 100వ వార్షికోత్సవం)

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)