Breaking News

‘నైటా’ అధ్యక్షురాలిగా ఏనుగు వాణి

Published on Tue, 12/10/2024 - 13:09

ఆత్మకూరు(ఎం): అమెరికాలోని న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) కొత్త అధ్యక్షురాలిగా ఏనుగు వాణి ఎన్నికయ్యారు. ఏనుగు వాణి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని సిద్దాపురం. న్యూయార్క్‌ నగరంలోని రాడిసన్‌ హోటల్‌లో భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

 నైటా కార్యవర్గాన్ని ఏడాదికొకసారి ఎన్నుకుంటారు. నైటాలో మొత్తం వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. నైటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అధ్యక్షురాలిగా ఏనుగు వాణితో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ వింగ్‌ నుంచి చైర్మన్‌తో సహా 12 మందితో కార్యవర్గం ఎన్నికైంది. నలుగురిని సలహాదారులుగా ఎన్నుకున్నారు. ఏనుగు వాణి భర్త ఏనుగు లక్ష్మణ్‌రెడ్డి ‘నైటా’ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ వింగ్‌ నుంచి వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 

ఏనుగు వాణి పుట్టినిల్లు యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామం కాగా.. ఇదే జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురం మెట్టినిల్లు. 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ‘నైటా’ ఆధ్వర్యంలో న్యూయార్క్‌ నగరంలో తెలంగాణ సంప్రదాయాలను చాటిచెప్పే పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు న్యూయార్క్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)