Breaking News

న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Published on Mon, 06/02/2025 - 18:28

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ వేడుకలతో పాటు బాలోత్సవ్ ను నిర్వహించారు. బెత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన ఈ ఉత్సవాలకు న్యూయార్క్ మెట్రో ప్రాంతంలో నివసించే తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నైటా అధ్యక్షురాలు వాణి అనుగు, కార్యవర్గసభ్యులు మంచి ఏర్పాట్లు చేయటంలో వేడుకలు చాలా ఉత్సాహంగా జరిగాయి. అభివృద్ది పథంలో పయనిస్తున్న తెలంగాణ మరింత ఎదగాలని సమావేశంలో మాట్లాడిన పలువురు ఎన్ఆర్ఐలు ఆకాంక్షించారు.  

సింగర్స్ సృష్టి చిల్ల, వందేమాతరం తరంగ్ తమ ఆటపాటలతో ఉత్సవాలకు మరింత ఊపును తెచ్చారు. బాలోత్సవ్‌లో భాగంగా ప్రవాసుల పిల్లలు తమ స్కిల్స్, టాలెంట్ షోతో ఆకట్టుకోవటంతో పాటు ఆడిపాడి అల్లరి చేశారు. నృత్యాలు, పాటలు, మ్యాజిక్ షో, మిమిక్రీ ఇలా పలు రకాల పోటీలు ఉత్సవాలకు ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు నైటా తరపున బహుమతులు అందించారు.

కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తం రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, లక్ష్మణ్ రెడ్డి అనుగు, అడ్వైజరీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: న‌్యూజిలాండ్‌లో తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)