Breaking News

వొరే సీనయ్యా, యాడికి బోతుండవా?; అమెరికాలో నెల్లూరోళ్ల కబుర్లు

Published on Mon, 01/16/2023 - 13:08

అబ్బయ్యా నువ్వేందిరా జెప్పేది? ఆనేక వస్తానని జెప్పి మద్దినాల దాక మంచం దిగలా? వొరే సీనయ్యా, యాడికి బోతుండవా? బిన్నా రారా శానా పనుంది. ఆయమ్మి ఈరోజుగూడా పప్పుల్సు జేసిందా? పిల్లకాయల్ని  అల్లాడిస్తుందిరా రోజూ అదే కూర బెట్టి.  సరేగాని పెద్దబ్బయ్య రాధా మహల్ దగ్గర దోసె కని  బొయ్యి ఇంకా రాలేదే. అందరం మూడాళ్ళలో కొత్త సిల్మా వచ్చుళ్ళా, బొయ్యి జూడాల. 

అదేన్దిరా ఆ మిడిమేళమా? బైకు దోలేది నువ్వోక్కడివేనా? ఈ ఎచ్చులుకు బోతే ప్రమాదం అబ్బయ్యో. నువ్వు కిండలు బడకుండా చెప్పిన మాట విను. రేపట్నించి రిక్షాలో బోరా. ఒరేయ్! చిన్నబ్బయ్యా. నువ్వింకా ఐస్కూల్లోనేరా సదివేది. అప్పుడే ఇంత  తుత్తర ఎందుకురా? అయ్యేరమ్మ కూతురితో నువ్వేందిరా జేసింది? ఎం బాగాలే. మీ నాయనకు జాబు రాస్తా రేపు. ఒక తూరి ఈడకు నాయనోస్తే నీకుంటయ్. జాగర్త!నీపాసుగాలా, ఏందిరా ఇంత పిసినారోడీవే. నడిపోడు కష్టాల్లో ఉళ్ళా. రొవంత అప్పు ఇస్తే నీ సొమ్ము ఏమ్బోయిన్దిరా!.  


ఈ పై మాటలు వింటుంటే మీకేమని పిస్తుంది?. నెల్లూరు భాష, యాసతో నెల్లూరోళ్ళ మధ్యలో నెల్లూరులో ఉన్నట్లు లేదూ?. అదే జరిగింది. నెల్లూరోళ్ళ మధ్యే కాని నెల్లూరులో కాదు. పదివేల మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ మహానగరంలో నెల్లూరుకు చెందిన దాదాపు వందమంది ప్రవాసీయులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. నెల్లూరీయుడు క్రష్ణారెడ్డి ఉప్పలపాటి చొరవదీసుకొని ఫ్రిస్కోలో ఉన్న “శుభం ఇవంట్ సెంటర్”లో శుక్రవారం సాయంత్రం ఈ మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించారు. డాలస్ మహానగర పరిసరాలలో పది, ఇరవై, ముప్పై ఏళ్లకు పైగా స్థిరపడ్డ నెల్లూరుకు సంబందించిన అనేక రంగాల ప్రముఖులు, నాయకులు, సేవకులు ఒక చోట చేరారు. 


ఎన్నాళ్లగానో తమ మదిలో దాచుకొన్న నెల్లూరు ప్రేమను ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళతో పంచుకోవడం విశేషం. ముఖ్యంగా విద్య, కుటుంబ నేపద్యం, ప్రస్తుతం చేస్తున్న వృత్తి, ప్రవృత్తుల సమాహారాన్ని ప్రతి ఒక్కరూ వినిపించారు. అవకాశమిస్తే ప్రతి ఒక్కరూ గంటల తరబడి నెల్లూరుకు సంబంధించిన అనుభూతులను పంచుకునేలా అనిపించింది. అలనాటి నెల్లూరు చేపల పులుసు, కమ్మరకట్లు, బాబు ఐస్క్రీం, రాధామాధవ్ కారం దోస, గాంధీబొమ్మ చెరుకు రసం, నెల్లూరు సుగంధపాలు, కోమల, వెంకటరమణ, మురళీకృష్ణ రుచులు, నెల్లూరు కోచింగ్ సెంటర్ అనుభవాలు, సినిమాలు, తదితర అపురూపమైన విశేషాలను పంచుకున్నారు. 

పెళ్ళిళ్లలో నెల్లూరోళ్ల ఆలోచనలు,హైస్కూలు, కాలేజి అనుభావాలకు సంబంధించిన అనేక అంశాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. మెత్తని నూలును తయారు చెయ్యడంలో ప్రసిద్ధి చెందిన నెల్లూరును ‘మాంచెస్టర్‌ ఆఫ్ ఇండియా’ అనే వారని గుర్తుచేశారు.  నిర్వాహకులు విందుభోజనం వడ్డించినప్పటికీ, నెల్లూరు కబుర్లతో సగం కడుపు నిండింది అనే చెప్పాలి. అందరూ ఒకరిని ఒకరు వీడ్కోలు పలుకులతోప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సార్లు కార్యక్రమాలు కావాలని విచ్చేసిన నేల్లూరీయులు కోరడంతో ఆత్మీయ సమ్మేళనానికి తేరపడింది. (క్లిక్ చేయండి: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)