Breaking News

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశం..!

Published on Mon, 10/07/2024 - 10:54

లాస్ ఏంజిల్స్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  అనేక కార్యక్రమాలతో తెలుగువారికి మరింత చేరువ అవుతుంది. ఈ క్రమంలోనే నాట్స్ 2024-2026 కి సంబంధించిన నూతన కార్యవర్గం తొలి సమావేశంలో లాస్ ఏంజిల్స్‌లోని అనాహైమ్‌లో సమావేశమై భవిష్యత్ కార్యచరణపై చర్చించింది. . డిసెంబర్ 15వ తేదీన బాలల సంబరాల నిర్వహణ, అక్టోబర్, నవంబర్‌ మాసాల్లో తెలుగు వారిని ఐక్యం చేసేలా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఓ ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించారు.

ముఖ్యంగా నాట్స్ హెల్ఫై లైన్ సేవలను మరింత విసృత్తం చేసే దిశగా నాట్స్ సభ్యులు, వాలంటీర్లు కృషి చేయాలని నాట్స్ మార్గదర్శకులు రవి ఆలపాటి పిలుపునిచ్చారు. సాటి తెలుగువారికి సాయపడేందుకు సదా సిద్ధంగా ఉండాలన్నారు. లాస్ ఏంజిల్స్‌లో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ అండగా ఉంటుందనే భరోసా ఉందని.. ఆ భరోసాను మరింతగా వృద్ధి చేసే బాధ్యత నాట్స్ సభ్యులపై ఉందన్నారు.  నాట్స్ లాస్ ఏంజిల్స్ చాప్టర్ విభాగ సమావేశానికి నాట్స్ మార్గదర్శకులు డాక్టర్ రవి ఆలపాటి, డాక్టర్ వెంకట్ ఆలపాటి, మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, శ్రీనివాస్ చిలుకూరి, శ్రీ మనోహర రావు మద్దినేని, రాజ్యలక్ష్మి చిలుకూరిలు నూతన కార్యవర్గానికి విలువైన సూచనలు చేశారు.

నాట్స్ లాస్ ఏంజిల్స్ కో ఆర్డినేటర్‌గా మురళీ ముద్దన
నాట్స్ లాస్ ఏంజిల్స్ 2024-2026కి మురళీ ముద్దన కో ఆర్డినేటర్‌గా, బిందు కామిశెట్టి జాయిట్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలను స్వీకరించారు. ఇంకా నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం నుంచి శంకర్ సింగంశెట్టి, ముకుంద్ పరుచూరి, శ్రీనివాస మునగాల, రేఖ బండారి, సతీష్ యలవర్తి, శ్యామల చెరువు, లత మునగాల, సిద్ధార్థ కోల, శ్రీరామ్ వల్లూరి, శివ కోత, అరుణ బోయినేని, హరీష్ అందె, చంద్ర మోహన్ కుంటుమళ్ల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గురు కొంక, రాధా తెలగం, పద్మజ గుడ్ల, సరోజా అల్లూరి తదితరులు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారు.

(చదవండి: అమెరికాలో బతుకమ్మ సంబరాలు..!)

 

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)