Breaking News

సివిల్ సర్వీసెస్ రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!

Published on Mon, 09/16/2024 - 07:05

అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్ధులకు ఉచితంగా మెటిరియల్ పంపిణీ చేసింది. నాట్స్ తాజా మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి చొరవతో ఈ 50 వేల పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు రూపొందించిన ఈ పుస్తకాలను గుంటూరులో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల ఆవిష్కరించారు. 

సివిల్ సర్వీసెస్‌ పరీక్షల కోసం పోటీ పడే పేద విద్యార్ధులకు సాయం చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టిందని రాజేంద్ర మాదల అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్ధులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పేద విద్యార్ధుల కోసం బాపు నూతి చూపిన చొరవ ప్రశంసనీయమని, నాట్స్ చేపడుతున్న సేవ కార్యక్రమాలు సమాజంలోని యువతలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయన్నారు.

50 వేల పుస్తకాలను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసే పేద విద్యార్ధులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన బాపు నూతి, రాజేంద్ర మాదలకు నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు.

(చదవండి: తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)