Breaking News

టంపాలో నాట్స్ 5కె రన్ కు మంచి స్పందన

Published on Mon, 01/27/2025 - 16:19

అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టంపాలో నాట్స్ నిర్వహించిన 5కె రన్‌కి మంచి స్పందన లభించింది. ఈ ఆదివారం టంపా నాట్స్ విభాగం ఆధ్వర్యంలో లోపెజ్ పార్క్ వద్ద నుంచి ఈ 5కె రన్ ప్రారంభమైంది. టంపాలో ప్రముఖ సంఘ సేవకురాలు డాక్టర్ మాధవి శేఖరం జ్ఞాపకార్థం ఈ 5కెను నిర్వహించింది. దాదాపు వంద మందికి పైగా తెలుగువారు ఈ 5కె రన్‌లో పాల్గొన్నారు.  శారీరక, మానసిక ఆరోగ్య అవశ్యకతను కూడా ఈ 5కె రన్ ప్రారంభంలో నాట్స్ నాయకులు వివరించారు. 

5K రన్ తర్వాత తెలుగు వారు తమ కుటుంబం స్నేహితులతో కలిసి పుషప్‌లు,  స్క్వాట్‌లు చేయగలిగారు.  ఒలింపియన్, బోస్టన్, ఎన్ వైసీ మారథాన్ ఛాంపియన్ అయిన మెబ్ కెఫ్లెజిఘి ఈ 5కె రన్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అన్నింటికి కన్నా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైందని, ప్రతిరోజు నడక, పరుగు ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంపొందిస్తాయని మెబ్ తెలిపారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ రన్ పేరుతో నిర్వహించిన ఈ రన్‌పై మెబ్ ప్రశంసలు కురిపించారు. నాట్స్ ఇలాంటి రన్ ఏర్పాటు చేయడంపై ఈ రన్‌లో పాల్గొన్న తెలుగువారంతా హర్షం వ్యక్తం చేశారు.  

ఈ రన్‌ని విజయవంతం చేసినందుకు నాట్స్ టంపా బే కోర్ వాలంటీర్లకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రన్‌కు  మద్దతు ఇచ్చిన స్థానిక సంస్థలు ఎఫ్.ఐ.ఏ, మాటాలకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 5కె రన్‌కి మంచి స్పందన రావడంతోటంపా నాట్స్ విభాగం ప్రతి సంవత్సరం ఈ రన్ నిర్వహించాలని యోచిస్తోంది.

నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాటా చాప్టర్ ప్రెసిడెంట్ టోనీ జన్ను, నాట్స్ మాజీ చైర్మన్, NATS సెలబ్రేషన్స్ 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ డి. మల్లాది, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/భాను భనుల లిప్కెటింగ్), రాజేష్ కాండ్రు, కోశాధికారి సుధీర్ మిక్కిలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఈస్ట్ సుమంత్ రామినేని, అడ్వైజరీ కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, భార్గవ్ మాధవరెడ్డి, అనిల్ అరెమండ, భరత్ ముద్దన, మాధవి సుధీర్ మిక్కిలినేని, మర్ల గద్దారెడ్డి, మున్నంగి, ప్రసాద్ నేరళ్ల, రవి కలిదిండి, కిరణ్ పొన్నం, నవీన్ మేడికొండ తదితరులు ఈ రన్‌లో పాల్గొన్నారు. 5కె రన్‌ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వారందరిని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీ కృష్ణ మేడిచెర్ల, కిషోర్ నార్నె, వెబ్ టీమ్ రవికిరణ్ తుమ్మల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు)

 

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)