Breaking News

వికలాంగులకు నాట్స్ చేయూత!

Published on Mon, 05/27/2024 - 10:20

అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే తాజాగా నిజామాబాద్‌లో ఓ దివ్యాంగుడు స్వశక్తితో ఎదిగేందుకు చేయూత అందించింది. హోప్ ఫర్ స్పందనతో కలిసి నాట్స్ దివ్యాంగుడు కిరణా దుకాణం పెట్టుకునేందుకు కావాల్సిన ఆర్ధిక సాయం చేసింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి ఈ కిరణా దుకాణాన్ని ప్రారంభించి ఆ దివ్యాంగుడికి భరోసా ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుందని విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి తెలిపారు. దివ్యాంగులు స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన చేయూత ఈ సమాజం అందించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. హోప్ ఫర్ స్పందన దివ్యాంగుల కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఆ సంస్థతో కలిసి తాము కూడా చేతనైన సాయం చేస్తున్నామని బాపు నూతి తెలిపారు.. దివ్యాంగుల సమస్యలను తమ దృష్టికి తెచ్చి వారికి చేయూత అందించడంలో తమను భాగస్వాములు చేసిన హోప్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

(చదవండి: యూఎస్‌ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)