Breaking News

డల్లాస్‌లో గాంధీ స్మారకాన్ని సందర్శించిన డా.సతీష్ రెడ్డి

Published on Mon, 02/06/2023 - 19:20

డల్లాస్‌: భారత రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు, ఇస్రో మాజీ ఛైర్మన్ డా.సతీష్ రెడ్డి.. అమెరికా డల్లాస్‌లోని మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. బాపూ విగ్రహానికి పుష్పగుచ్చం సమర్పించి నివాళులు అర్పించారు.

సతీష్ రెడ్డికి గాంధీ మెమోరియల్ సెక్రెటరీ కల్వల రావు స్వాగతం పలికారు. డా.ప్రసాద్ తోటకూర స్ఫూర్తితోనే గాంధీ స్మారకాన్ని నిర్మించినట్లు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. ఏటా నిర్వహించే కార్యక్రమాల్లో చాలా మంది పాల్గొంటున్నట్లు చెప్పారు.

డా.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్ముని పాత్ర ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ దేశాల నాయకులు ఆయన నుంచి ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు అజయ్ కలవల, రంగారావు, గోపి చిలకూరి, ప్రవీణ్ రెడ్డి, బీమ పెంట, జీవీఎస్ రామకృష్ణ, కృష‍్ణారెడ్డి కోడూరు, శరత్ రెడ్డి యర్రం, శ్రీకాంత్ పోలవరపు, ఇతరులు పాల్గొన్నారు.
చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)