Breaking News

22 నెలలకుపైగా న్యాయ పోరాటం.. భారతీయ అమెరికన్‌కు ఊరట

Published on Wed, 12/27/2023 - 22:32

న్యూయార్క్: అమెరికాలో 22 నెలలకు పైగా న్యాయ పోరాటం తర్వాత ఓ భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఊరట కలిగింది. తాను కొనుక్కున్న ఇంటిలో తిష్టవేసిన జంట ఎట్టకేలకు ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ భారతీయ అమెరికన్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

గతేడాది ఫిబ్రవరిలో బ్యాంక్ వేలంలో జెరిఖోలోని ఫ్రెండ్లీ లేన్‌లోని 1,536 చదరపు అడుగుల ఇంటిని బాబీ చావ్లా అనే ఇండియన్‌ అమెరికన్‌ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటి గత యజమానులైన బారీ, బార్బరా పొలాక్ ఆ ఇంటిని విడిచి పెట్టకుండా తిష్ట వేసినట్లు  న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

తాను ఆ ఇంటి కోసం పన్నులు, తనఖా చెల్లింపులు, ఇతర బిల్లుల రూపంలో ఇప్పటివరకు 85 వేల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు చావ్లా పేర్కొన్నాడు. ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన చావ్లా తల్లిదండ్రులను బారీ పొలాక్ తిడుతూ "పాకిస్తాన్‌కు వెళ్లిపోండి" అంటూ అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది. 

నిందితులు 1990లో 2,55,000 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2006 నాటికి తమ తనఖా చెల్లించడం మానేశారు. కోర్టు పత్రాల ప్రకారం, 2008లో ఇల్లు జప్తునకు రాగా బారీ, బార్బరా పొలాక్ జంట ఒక దశాబ్దానికి ఇల్లు జప్తు కాకుండా దశాబ్దానికిపైగా కేసును లాక్కొచ్చారు. ఇంటి జప్తు నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ఏడు సార్లు దివాలా పిటిషన్లు వేశారు.

బార్బరా పొలాక్ గత నెలలో తాజాగా మరోసారి దివాలా పిటిషన్‌ వేయడంతో ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం ఆగిపోయింది. కాగా గతవారం కేసును విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి పోలాక్స్‌ను మళ్లీ దివాళా పిటిషన్లు దాఖలు చేయకుండా నిరోధించారు. దీంతో ఆ జంట చివరకు డిసెంబర్ 22న ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు. 

"ఇది క్రిస్మస్ అద్భుతంలా అనిపిస్తోంది, నేను నమ్మలేకపోతున్నాను" అని ది న్యూయార్క్ పోస్ట్‌తో బాబీ చావ్లా అన్నారు.  తాను ఆ ఇంటిని తన ఆరు నెలల గర్భిణీ సోదరి, ఆమె భర్తకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)