Breaking News

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

Published on Wed, 11/27/2024 - 15:28

అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. అమెరికన్ సమాజంలో సామాజిక బాధ్యతను విద్యార్ధులకు అలవర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది. నాట్స్ చికాగో విభాగం  నిర్వహించిన ఈ హైవే దత్త కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, వాలంటీర్లు, విద్యార్ధులు పాల్గొని హైవేను శుభ్రం చేశారు. 

అమెరికాలో సామాజిక సంస్థలు రోడ్లను, పబ్లిక్ ప్లేస్‌లను దత్తత తీసుకుని వాటిని శుభ్రం చేస్తుంటాయి. నాట్స్ కూడా ఇందులో నేనుసైతం అంటూ రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అడాప్ట్ హైవే కార్యక్రమాన్ని నాట్స్ నిర్వహిస్తూ వస్తుంది. చికాగోలో నిర్వహించిన ఈ హైవే దత్తత కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పాల్కని సమాజం కోసం స్వచ్ఛందంగా పనిచేసేలా భావితరాన్ని ప్రోత్సాహించారు. ఇలా సమాజం కోసం విద్యార్ధులు వెచ్చించిన సమయాన్ని అక్కడ కాలేజీలు కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. 

నాట్స్ హైవే దత్తత కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలరందని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అభినందించారు. చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్లపాటిలు చక్కటి ప్రణాళిక, సమన్వయంతో హైవేను పరిశుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషించారు. చికాగో చాప్టర్ సభ్యులు ఈశ్వర్ వడ్లమన్నాటి, మహేష్ కిలారు, శ్రీనివాస్ ఎక్కుర్తి, రమేష్ జంగాల, దివాకర్ ప్రతాపుల, సునీల్ ఎస్, నిపున్ శర్మలు ఈ హైవే దత్తతకు చక్కటి మద్దతు, సహకారం అందించారు.

భావితరాలకు ఎంతో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమం కోసం చికాగో చాప్టర్‌కి దిశా నిర్థేశం చేసిన  నాట్స్  బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ పిడికిటి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు ఆర్‌కే బాలినేని, హరీష్‌ జమ్ముల, ఇమ్మాన్యుయేల్‌ నీల, మాజీ బోర్డు సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరసాడ, శ్రీనివాస్‌ బొప్పనలకు నాట్స్ చికాగో విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే ఎంతో ఉపయుక్తమైన హైవే దత్తత కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ చికాగో విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు.

(చదవండి:
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)