Breaking News

మెదడును నియంత్రించే ఫంగస్‌!

Published on Mon, 06/30/2025 - 07:09

చాన్నాళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సృష్టించిన హాలీవుడ్‌ చిత్రం జురాసిక్‌ పార్క్‌ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో అడవిలో పేద్ద చెట్టు నరికేస్తుంటే దాని జిగురులో ఒక దోమ చిక్కుకుపోయి ఉంటుంది. ఆ దోమ అప్పటికే ఒక పెద్ద డైనోసార్‌ను కుడుతుంది. ఆ డైనోసార్‌ రక్తం నుంచి సేకరించి డీఎన్‌ఏతో శాస్త్రవేత్తలు మళ్లీ డైనోసార్‌కు ప్రాణప్రతిష్టచేస్తారు. అచ్చం అలాగే 9.9 కోట్ల సంవత్సరాల క్రితంనాటి ఒక జిగురులో చిక్కుకుపోయిన చీమ, ఈగల సాయంతో వాటికి సోకిన ఒక ఫంగస్‌ జాడను నేడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ ఫంగస్‌ కూడా డైనోసార్ల కాలంనాటిదిగా పరిశోధకులు భావిస్తున్నారు.

జాంబీ ఫంగస్‌?
చెట్లు సూర్యరశ్మి ద్వారా కిరణజన్యసంయోగ క్రియ జరిపి శక్తిని సంపాదిస్తాయి. అయితే ఫంగస్, కీటకాలు వంటివి సొంతంగా ఆహారాన్ని, శక్తిని సృష్టించుకోలేక ఇతర జీవులపై ఆధారపడతాయి. వీటిని పరాన్న జీవులు అంటారు. అలాంటి పరాన్న జీవజాతులకు చెందిన కొన్ని ఫంగస్‌ రకాలు ఏకంగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టేస్తాయి. అంటే చీమ మెదడులోకి దూరి దానినే ఈ ఫంగస్‌ నియంత్రిస్తుంది. దాంతో ఆ చీమ ఒక ‘జాంబీ’ తరహాలో నియంత్రణ తప్పి ప్రవర్తిస్తుంది. అలాంటి జాంబీ ఫంగస్‌ ఈకాలంలోనేకాదు డైనోసార్ల కాలంలోనూ జీవించి ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఈ జిగురులో చిక్కుకుపోయిన ఈగ, చీమలో కొత్త రకం ఫంగస్‌ల ఆనవాళ్లను గుర్తించారు. అయితే ఈ జాంబీ ఫంగస్‌ ఎంతటి శక్తివంతమైంది?. ఆనాటి చిన్నపాటి జీవజాలానికి ఇవి సోకి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయా అనే ప్రశ్నలకు ఇప్పుడు శాస్త్రవేత్తలు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు.

ఏమిటీ ఫంగస్‌ ప్రత్యేకత 
కొన్ని రకాల కీటకాలు ఎక్కువగా ఒఫియోకార్డిసెప్స్‌ అనే ఫంగస్‌ బారిన పడతాయి. ఈ కీటకాల్లోని అతిదేహి కణాల్లోకి ఫంగస్‌ చొరబడి నెమ్మదిగా మెదడును చేరుతుంది. మెదడు కణాలను ఫంగస్‌ తనకు అనువుగా పనిచేసేలా మార్చేస్తుంది. పని పూర్తయ్యాక చివరకు ఆ కీటకాన్ని ఈ ఫంగస్‌ కణాలు చంపేస్తాయి. కీటక ప్రపంచంలో ఒఫియోకార్డిసెప్స్‌ ఫంగస్‌ వ్యాప్తి వివరాలపై తాజాగా పరిశోధన వేగవంతంకానుంది. అయితే తాజాగా ఈ చీమ, ఈగలో కనుగొన్న ఫంగస్‌లను గతంలో శాస్త్రవేత్తలు ఎన్నడూ చూడలేదు. దీంతో వీటికి కొత్త పేర్లు పెట్టారు. ‘‘ 9.9 కోట్ల ఏళ్ల క్రితం నాటి జీవులకు సోకిన ఫంగస్‌ రకాలున్న చీమ, ఈగ లభించడం నిజంగా అత్యంత అరుదు’’ అని నైరుతి చైనాలోని యునాన్‌ విశ్వవిద్యాలయంలోని పురాతనజీవశాస్త్ర విభాగ డాక్టోరల్‌ విద్యారి్థ, ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన యుహూయీ ఝువాంగ్‌ చెప్పారు. 

‘‘ఒఫియోకార్డిసెప్స్‌ ఫంగస్‌ పూరీ్వకులను గుర్తించడం ఇదే తొలిసారి. అందుకే వీటికి కొత్త పేర్లు పెట్టాం. చీమలో లభించిన కొత్త ఫంగస్‌కు పాలియోకార్డిసెప్స్‌ అని, ఈగకు సోకిన ఫంగస్‌కు పాలియోకార్డిసెప్స్‌ ఐరనోమేయీ అని నామకరణం చేశారు. కొన్ని ఒఫియోకార్డిసెప్స్‌ ఫంగస్‌ జాతులు ఈకాలంనాటి చీమలకూ సోకుతాయి. ఈ ఫంగస్‌కు ‘జాంబీయాంట్‌ ఫంగీ’ అనే పేరుంది. మెదడులోకి ఒఫియోకార్డిసెప్స్‌ ఫంగస్‌ వ్యాపించి తనకు అనువుగా ప్రవర్తించేలా చీమను తన వశంచేసుకుంటుంది. హెచ్‌బీఓ ప్రసారమైన టీవీ సిరీస్‌ ‘ ది లాస్ట్‌ ఆఫ్‌ అస్‌’కు ఈ ఫంగసే స్ఫూర్తి. కొత్త ఫంగస్‌ రకాలను కనుగొన్న పరిశోధనా తాలూకు వివరాలు ‘‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ రాయల్‌ సొసైటీ’’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కొత్త ఫంగస్‌ల రూపురేఖలు, లక్షణాలను తెల్సుకునేందుకు మైక్రో–కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ ద్వారా త్రిమితీయ చిత్రాలను తీశారు. 14 నుంచి ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం నాటి ఫంగస్‌గా తేల్చారు. ఈ కాలాన్ని క్రిటేసియస్‌ కాలంగా పరిగణిస్తారు. ‘‘ జాంబీ ఫంగస్‌ సోకిన కీటకాలు త్వరగా చనిపోతాయి. ఒకరకంగా ఈ రకం కీటకాల జనాభాను నియంత్రించే కారకాలుగా జంబీ ఫంగస్‌ను చెప్పొచ్చు’’ అని పరిశోధకుడు ఝువాంగ్‌ వ్యాఖ్యానించారు.  

ఇప్పుడు ఏ జాతులకు సోకుతున్నాయి?  
చీమలతోపాటు ఈగ, సాలెపురుగు, పేడపురుగు, సికాడాస్‌ పెద్ద ఈగ జాతులకూ ఈ జాంబీ ఫంగస్‌ బెడద ఉందని లండన్‌లోని నేచరల్‌ హిస్టరీ మ్యూజియం పత్రాలు వెల్లడిస్తున్నాయి. గండు చీమల మెదడులోకి నేరుగా దూరిపోయి వాటిని జాంబీ చీమలుగా మారుస్తాయని వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచరల్‌ హిస్టరీ సీనియర్‌ సైంటిస్ట్‌ కాన్రాడ్‌ లాబండీరీ చెప్పారు.  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)