Breaking News

ఎంత కష్టం! కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో

Published on Wed, 06/28/2023 - 17:02

జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ప్లాస్టిక్ కవర్లో ఆహారాన్ని తింటున్న వీడియో ఒకటి పోస్ట్ చేసి.. మన కడుపు నింపడం కోసం కడుపు మాడ్చుకుని పనిచేసే ఇలాంటి డెలివరీ బాయ్ ల యోగక్షేమాలు కూడా పట్టించుకోండని ఒక ఐఏఎస్ అధికారి నెటిజెన్లను కోరారు. క్షణాల్లో వైరల్ గా మారిన ఆ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.      

బాగా బిజీగా ఉన్న ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లో ఫుడ్ డెలివరీ చేయడానికి వెళ్లిన జొమాటో డెలివరీ బాయ్ పార్సిల్ అందించిన తర్వాత అక్కడే పార్కింగ్ ఏరియాలో తన బైక్ వద్ద నిలబడి ప్లాస్టిక్ కవర్లో తన వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారుగా తింటున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. చూస్తుంటేనే హృదయం ద్రవించిపోయే ఈ సన్నివేశాన్ని అవనీశ్ శరణ్ అనే ఒక ఐఏఎస్ అధికారి ట్విట్టర్లో అప్లోడ్ చేయగా మూడు లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోతో పాటుగా..  "ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వారి గురించి కూడా కొంచెం పట్టించుకోండి.." అని రాశారు.      

ఈ వీడియోకు వీక్షకుల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందించారు. అలాంటి వారికి మీకు తోచినది పెట్టి వారి కడుపు నింపమని, కనీసం గ్లాసు మంచి నీళ్ళైనా ఇచ్చి వారి గొంతు తడపమని అభ్యర్థిస్తున్నారు నెటిజన్లు.  

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరి జీవన విధానం తేలికైపోయింది. వైవిధ్యమైన, నోరూరించే ఆహారాల్లో ఏది కావాలంటే అది ఫోన్లో ఆర్డర్ పెడితే చాలు నచ్చిన ఐటమ్ నిముషాల్లో మన ముందు వాలిపోతుంది. కానీ దాని వెనుక ఇలాంటి ఎందరో  శ్రామికుల కష్టం దాగుంది. కుటుంబ పోషణ కష్టమైన ఈ రోజుల్లో, వారు ఆకలికి ఓర్చుకుని ఎదుటివారి ఆకలిని తీరుస్తున్నారన్న విషయాన్ని మరువకూడదు.   

ఇది కూడా చదవండి: 106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)