Breaking News

‘ఓటర్ అధికార్ యాత్ర’కు యూసుఫ్ పఠాన్

Published on Sat, 08/30/2025 - 13:22

కోల్‌కతా: బీహార్‌లో ఓటరు జాబితా సవరణ పేరుతో కొందరు ఓటర్ల పేర్లను ప్రభుత్వం తొలగించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు ‘ఓటర్ అధికార్ యాత్ర’ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో టీఎంసీ నేత, మాజీ క్రికెటర్‌ యూసుఫ్ పఠాన్ భాగస్వాములు కానున్నారు. ఆయనతో పాటు మరో టీఎంసీ నేత లలితేష్ త్రిపాఠి కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు.

సెప్టెంబర్ ఒకటిన బీహార్‌లో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’లో యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు తృణమూల్ కాంగ్రెస్ తరపున పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 17న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పాదయాత్రను ప్రారంభించారు. బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ ఈ యాత్రను చేపట్టారు. సోమవారం(సెప్టెంబరు ఒకటి)పట్నాలో జరిగే ఊరేగింపుతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగియనుంది. యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు పట్నాలో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’కు  ప్రాతినిధ్యం వహించనున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్‌లోని 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. బీహార్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సహాయంతో ఓట్లను దొంగిలిస్తూ పట్టుబడటంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటర్ల జాబితా నుండి 65 లక్షల మంది పేర్లను తొలగించడం అనేది వారి ఓటు హక్కుపై జరిగిన దాడిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు