Breaking News

నో ఆల్కహాల్‌ ప్లీజ్!

Published on Fri, 09/19/2025 - 04:20

అసలే యూత్‌.. ఆపై ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. ఇంకేముంది భారతీయ మిలీనియల్స్‌ (29–44 సంవత్సరాల వయసు), జెన్‌–జీ తరం (13–28 ఏళ్లు) ఆల్కహాల్‌ లేని లేదా తక్కువ ఆల్కహాల్‌ ఉన్న పానీయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో బాగా కనిపిస్తోంది. సరదాగా గడిపేందుకు ఆల్కహాల్‌ మాత్రమే పరిష్కారం కాదన్నది యువతరం మాట.

సోషల్‌ డ్రింకింగ్‌ కల్చర్‌ భారత్‌లో క్రమంగా మారుతోంది. నీల్సన్‌ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం.. సర్వేలో పాలుపంచుకున్న భారతీయ వినియోగదారుల్లో 24% మంది ఆల్కహాల్‌ రహిత లేదా తక్కువ ఆల్కహాల్‌ ప్రత్యామ్నాయాలను ఆస్వాదిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 17% ఉంది. ఆల్కహాల్‌ రహిత లేదా తక్కువ ఆల్కహాల్‌ ఉన్న పానీయాలను తీసుకుంటున్నవారిలో సగానికి పైగా జెన్‌–జీ, మిలీనియల్స్‌ ఉన్నారు. ఫిలిప్పీన్్స తర్వాత ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో ఇలాంటి మాక్‌టెయిల్స్‌కు (ఆల్కహాల్‌ రహిత పానీయాలు) భారత్‌ రెండో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. మనదేశంలో ఉత్తరాదిలో దాదాపు 54% మంది, తూర్పు భారతంలో 50%, పశ్చిమాన 43%, దక్షిణాన 37% మంది ఆల్కహాల్‌ పానీయాలను ఇష్టపడుతున్నారని నివేదిక తెలిపింది.

ట్రెండ్‌గా మారుతోంది
సాంస్కృతిక, సామాజిక వైఖరుల్లో వస్తున్న మార్పులు దేశంలో మద్యపాన రహిత జీవనశైలికి మార్గం సుగమం చేస్తు న్నాయి. మద్యపానానికి దూరంగా ఉండటం అనేది గతంలో మతపరమైన లేదా ఆరోగ్య కారణాలతో ముడిపడి ఉండేది. ప్రస్తుతం ట్రెండ్‌గా మారుతోంది. ఏం తీసుకుంటు న్నాం, వాటి ప్రభావం ఏమిటో తెలుసుకుని మరీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మిలీనియల్స్, నిపుణులు, పట్టణ వినియోగదారుల నుంచి ఆల్కహాల్‌ రహిత పానీయాలకు డిమాండ్‌ పెరుగుతోంది. సంప్రదాయ బీర్‌ అనుభవాన్ని రాజీ పడకుండా మెట్రోలలో ఈ డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీలు కూడా నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయి.

జీబ్రా స్ట్రిప్పింగ్‌ ట్రెండ్‌
జెన్‌–జీ అంటేనే సరికొత్త కోరికలు, ఆవి ష్కరణలకు పెట్టింది పేరు. వారు ఇటీవలి కాలంలో జీబ్రా స్ట్రిప్పింగ్‌ ట్రెండ్‌ను ఎక్కువ గా అనుసరిస్తున్నారు. అంటే ప్రతి ఆల్కహా లిక్‌ డ్రింక్‌ తర్వాత ఆల్కహాల్‌ రహిత పానీ యాలను తీసుకుంటున్నారు. యూత్‌ ఎక్కు వగా కాక్‌టెయిల్స్, ప్రీమియం డ్రింక్స్‌ తాగు తున్నారు. విలువ పరంగా చూస్తే వీటి విలు వ ఎక్కువే కావడం గమనార్హం. అందుకే, కొన్ని కంపెనీలు ఆల్కహాల్‌ లేని పానీయా ల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి.

ఆల్కహాల్‌ రహితంవైపు..
నీల్సన్ఐక్యూ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 53% మంది పూర్తిగా తాగనివారు లేదా చాలా తక్కువ తాగేవారు.. చట్టబద్ధంగా తాగే వయస్సు కలిగి ఉన్నారు. అంటే.. వీళ్లంతా 18–34 ఏళ్ల లోపు వారన్నమాట. ఇక, ఈ కేటగిరీలో ఉన్న 35–54 ఏళ్లవారు 35 శాతం కాగా, 55 ఏళ్లకుపైబడిన వారు 13 శాతం. ఆల్కహాల్‌ రహిత పానీయాల వైపు యువత ఆకర్షితులవుతుండటంతో ఈ మార్కెట్‌ దేశంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.

ప్రధానంగా ఈ ట్రెండ్‌ మెట్రోల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నాన్ ఆల్కహాలిక్‌ స్పిరిట్స్‌ లభ్యత గతంలో చాలా పరిమితంగా ఉండేది. ప్రస్తుతం ఇవి విరివిగా లభిస్తుండడం సైతం డిమాండ్‌కు ఆజ్యం పోస్తోంది. పైగా క్విక్‌ కామర్స్‌ కంపెనీలు వీటిని నేరుగా కస్టమర్లకు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. హైదరాబాద్, గోవా, బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్‌లోని బార్లు సరికొత్త మాక్‌టెయిల్స్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. కోలా పానీయాలు, తాజా లైమ్‌ సోడా, మొహిటో వంటి ఆల్కహాల్‌ రహిత పానీ యాలు మెనూలో వెనుక భాగంలో ఉండే రోజులు పోయాయన్నది మార్కెట్‌ వర్గాల మాట.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)