Breaking News

యూపీలో కొత్తగా మహా కుంభమేళా జిల్లా

Published on Mon, 12/02/2024 - 07:30

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మరో జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ఇకపై కొత్త గుర్తింపు రానుంది. ఈ జిల్లా పేరు మహాకుంభమేళా. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌   అధికారులతో సమావేశమైన అనంతరం దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

జనవరిలో రాబోయే కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాను మహాకుంభమేళా జిల్లాగా పిలవనున్నారు. కుంభమేళాను సజావుగా నిర్వహించేందుకు, పరిపాలనా పనులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మహా కుంభమేళా జిల్లాలో ఇండియన్ సివిల్ సెక్యూరిటీ సెక్షన్ 14 (1) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లను నియమించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే  మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో 2025, జనవరి 13 నుండి  ప్రారంభమై 2025, ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది.

ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)