Breaking News

వారణాసిలో జ్ఞానవాపీ విశ్వనాథ ఆలయం

Published on Sun, 09/15/2024 - 05:43

గోరఖ్‌పూర్‌:  వారణాసిలోని జ్ఞానవాపీని మసీదు అని పిలుస్తుండడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  అన్నారు. అది మసీదు కాదని చెప్పారు. జ్ఞానవాపీ ప్రాంగణమంతా విశ్వనాథుడి ఆలయమని స్పష్టంచేశారు. ఆ విషయం విశ్వనాథుడే స్వయంగా చెప్పాడని తెలిపారు. 

శనివారం దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్‌ యూనివర్సిటీలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్‌పంత్‌ పాత్ర’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జ్ఞానవాపీని మసీదుగా కొందరు పరిగణిస్తుండడం సరైంది కాదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే ఆది శంకరుడికి, కాశీ విశ్వనాథుడికి మధ్య సంవాదం జరిగిందని తెలిపారు. జ్ఞానవాపీ తన ప్రాంగణమేనని ఆది శంకరుడితో విశ్వనాథుడు చెప్పినట్లు వెల్లడించారు. జ్ఞానవాపీ వ్యవహారంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)