Breaking News

రైల్వే స్టేషన్లలోని బోర్డులకు పసుపు రంగు ఎందుకు?

Published on Wed, 02/28/2024 - 08:31

భారతీయ రైల్వే.. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్ కలిగివుంది భారతీయ రైళ్లలో ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు.  అలా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు  పలు రైల్వే స్టేషన్‌లలో పసుపు రంగు బోర్డులు మనకు కనిపిస్తాయి. వాటిపై ఆ రైల్వే స్టేషన్ పేరు, సముద్ర మట్టానికి అది ఎంత ఎత్తులో ఉన్నదీ రాసివుంటుంది. అయితే రైల్వే సైన్ బోర్డులకు పసుపు రంగునే ఎందుకు వేస్తారో తెలుసా? దీని వెనుక గల కారణాన్ని  ఇప్పుడు తెలుసుకుందాం. 

పసుపు రంగు ప్రత్యేకత ఏమిటంటే అది చాలా దూరం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రైలు స్టేషన్‌కు చేరుకోకముందే డ్రైవర్ దూరం నుండి పసుపు రంగును బోర్డును చూడగలుగుతాడు. తద్వారా అతనికి  స్టేషన్ రాబోతున్నదని తెలుస్తుంది. ఇలా స్టేషన్ బోర్డు చూసిన తర్వాత రైలు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉంటారు.

పసుపు రంగు  అనేది సూర్యకాంతితో అనుసంధానమై ఉంటుంది. ఈ రంగును ఇతర రంగులతో పోలిస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ రంగు చూపరుల మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి తోడు పసుపురంగు బోర్డుపై నలుపు రంగులో రాసే అక్షరాలు దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కళ్లకు ఒత్తిడిని కూడా కలిగించదు.

ఇదేవిధంగా విద్యాసంస్థల బస్సుల కూడా పసుపు రంగులో  ఉండటాన్ని గమనించే ఉంటాం. దీనికి కారణం దూరం నుండి ఈ రంగు కనిపించడం. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తారు. రైలు లోకో పైలట్‌కు స్టేషన్‌కు సంబంధించిన పసుపురంగు బోర్డు కనిపించగానే హారన్ మోగిస్తాడు. దీంతో రైలులోని ప్రయాణికులు కూడా స్టేషన్‌ రాబోతున్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)