Breaking News

Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్‌ పరిణామాలు

Published on Mon, 12/23/2024 - 13:36

దేశంలోని విమానయాన రంగానికి 2024 మిశ్రమంగా  గడిచింది. ఈ సంవత్సరం రెండు విమానయాన సంస్థలు మూసివేతకు గురయ్యాయి. ఒక విమానయాన సంస్థ దివాలా ప్రక్రియకు దారితీసింది. ఈ ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెండుసార్లు రికార్డు స్థాయిలో ఐదు లక్షలను అధిగమించింది.

దేశంలో దీపావళి, ఛత్ సందర్భంగా విమానయాన టిక్కెట్ల ఛార్జీల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది నవంబర్ 14 వరకు విమానయాన సంస్థలకు  మొత్తం 999 సార్లు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. విచారణలో అవి ఫేక్‌ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద  పైకప్పు కూలిపోయిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు.

2025లో చోటుచేసుకోబోయే మార్పులివే..
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన రంగం 2025లో పెను మార్పులను చూడబోతోంది. భారీ విలీనాలతో పాటు, విమానాల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇంతేకాకుండా పలు కొత్త ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభం కానున్నాయి.  మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ట్రాఫిక్ 164 నుంచి 170 మిలియన్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచడం, ఎక్కువ సంఖ్యలో ప్రత్యక్ష విదేశీ విమాన లింక్‌లను ఏర్పాటు చేయడం, దేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడంపై పరిశ్రమ  దృష్టి కేంద్రీకృతమై ఉంది.

ఇటీవల అకాసా ఎయిర్ హెడ్ వినయ్ దూబే మాట్లాడుతూ భారతీయ విమానయాన మార్కెట్‌కు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయన్నారు. కాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ 60కి పైగా వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా 800 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. 157 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యమైన విస్తారాతో ఎయిర్ ఇండియా తన విలీనాన్ని  ఇటీవలే పూర్తి చేసింది. ఎయిరిండియా ఫ్లైట్ రిటర్న్ ప్రోగ్రామ్ పేరును 'మహారాజా క్లబ్'గా మార్చాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ చేసింది. వీటిలో10 వైడ్-బాడీ ఏ350, 90 నారో బాడీ ఏ320 విమానాలున్నాయి.

ఇది కూడా చదవండి: Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)