Breaking News

యూపీ సీఎంపై మహంత్‌ తీవ్ర వ్యాఖ్యలు.. పోలీసులతో వాగ్వాదం

Published on Sat, 09/30/2023 - 07:30

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నాదేవి ఆలయ ‍ప్రధాన పూజారి(మహంత్‌) యతి నరసింహానంద్‌ సరస్వతి సీఎం యోగి ఆదిత్యానంద్‌ను కలుసుకునేందుకు బయలుదేరారు. ఈ నేపధ్యంలో అతనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారిని నిందించడమే కాకుండా సీఎంను ఉద్దేశిస్తూ, ఆధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే యతి నరసింహానంద్‌ గత 27న మీరఠ్‌లోని ఖజురీ గ్రామానికి వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఏడాది క్రితం దీపక్‌ త్యాగి హత్య జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఆ గ్రామానికి వెళ్లాలని భావించారు. అయితే స్థానిక పోలీసులు ఆయనను అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 

ఈ నేపధ్యంలో యతి నరసింహానంద్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్‌కు తన రక్తంతో ఒక ఉత్తరం రాశారు. ఘజియాబాద్‌ నుంచి లక్నో వరకూ పాదయాత్రగా వెళ్లి, ఆ ఉత్తరాన్ని యోగి ఆదిత్యానంద్‌కు ఇవ్వాలనుకున్నారు. అయితే పోలీసులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో  ములాయం, మాయావతి, అఖిలేష్‌ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తనను పోలీసులు ఎప్పుడూ అడ్డుకోలేదని, ఇప్పుడు యోగి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి రావణాసుసురుడికంటే తక్కువవాడేమీ కాదని పేర్కొన్నారు. సీఎం పోలీసుల మాటనే వింటున్నారని, తన మాట వినడం లేదని యతి నరసింహానంద్‌ ఆరోపించారు. 

కొద్దిసేపు యతి నరసింహానంద్‌కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం పాదయాత్రకు పోలీసులు అనుమతినిచ్చారు. దీంతో అతని శిష్యులు 10 రోజుల పాటు పాదయాత్ర చేసి, ఆ లెటర్‌ను  అక్టోబరు 8న సీఎంకు అందివ్వనున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: పాక్‌ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్‌

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)