Breaking News

ఢిల్లీ పోలింగ్‌.. కేజ్రీవాల్‌కు షాక్‌

Published on Wed, 02/05/2025 - 08:13

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేళ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు షాక్‌ తగిలింది. యమునా నదిలో విషం కలిపారని చేసిన వ్యాఖ్యలకుగానూ  ఆయనపై మంగళవారం హర్యానాలో ఓ కేసు నమోదైంది.

ఢిల్లీకి వచ్చే యమునా నది నీటిలో హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషం కలిపిందని అరవిం‍ద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే తన ఆరోపణలు తప్పని నిరూపించాలంటూ రాజకీయ ప్రత్యర్థులకు ఆయన సవాల్‌ కూడా విసిరారు. దీంతో హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ.. యమునా నీటిని తాగి మరీ కేజ్రీవాల్‌ విమర్శలను తిప్పికొట్టారు. అదే సమయంలో.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ(PM Modi), కేజ్రీవాల్‌ ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.  మరోవైపు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దాకా కూడా చేరింది. అయితే.. 

అయితే.. ఈ అంశంపై తాజాగా షాబాద్‌(Shahbad)కు చెందిన జగ్మోహన్‌ మంచందా అనే లాయర్‌, కురుక్షేత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలతో కేజ్రీవాల్‌ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో జగ్మోహన్‌ పేర్కొన్నారు. దీంతో బీఎన్‌ఎస్‌ 192, 196(1),197(1),248(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కురుక్షేత్ర పోలీసులు విచారణ చేపట్టారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)