Breaking News

ఢిల్లీకి ‘యమున’గండం.. ఏ క్షణంలోనైనా భారీ వరద?

Published on Mon, 08/18/2025 - 11:50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీకి వరద గండం పొంచివుంది. ఉగ్రరూపం దాల్చిన యమునా నది ఏ క్షణాన అయినా ఢిల్లీని ముంచెత్తే అవకాశం ఉందనే హెచ్చరికలు అందుతున్నాయి. యమునా నది (నేడు)సోమవారం ప్రమాద స్థాయిని దాటిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీకి చెందిన 18 గేట్లను తొలిసారిగా తెరిచి, భారీ పరిమాణంలో నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాత  యమునలో నీటి ఉధృతి అధికం అయ్యింది.

హత్నికుండ్‌ బ్యారేజీల నుండి ప్రతి గంటకు నీటిని విడుదల చేసిన కారణంగా రాజధానిలోని యమునలో నీటి మట్టం పెరిగిందని అధికారులు నిర్ధారించారు. యమునా నది సోమవారంనాటికే  ప్రమాద స్థాయిని దాటింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) హర్యానా, వజీరాబాద్‌లోని హత్నికుండ్ బ్యారేజీ నుండి విడుదల చేసిన నీటి కారణంగా ఆగస్టు 19 నాటికి నీటి మట్టాలు 206 మీటర్లకు చేరుకుంటాయనే అంచనాలున్నాయి. ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం పెరుగుతుండటంతో స్థానికులను తరలించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

యమునా నది స్థాయి 206 మీటర్లు దాటే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం  హెచ్చరించింది.  ఆగస్టు 19 నాటికి యమున 206 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఎగువ యమున ప్రాంతంలో భారీ వర్షపాతం దృష్ట్యా, ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం ఆగస్టు 19, తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో 206.00 మీటర్లు దాటవచ్చని తెలిపింది. ఈ వర్షాకాలంలో అత్యధికంగా నీటిని విడుదల చేసిన హత్నికుండ్ బ్యారేజీ ప్రస్తుతం 1.27 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోందని, ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని కేంద్ర వరద నియంత్రణ విభాగపు అధికారులు తెలిపారు. వరద  పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు నదీ తీరాలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)