Breaking News

తండ్రికి సాధ్యం కానిది... కుమారుడు సాధించాడు

Published on Thu, 06/06/2024 - 11:15

మైసూరు: మైసూరుకు రాజ వంశానికి చెందిన శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్‌ మైసూరు పార్లమెంటుకు బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అయితే ఆయన దత్త కుమారుడు యదువీర్‌ శ్రీకంఠదత్త చామరాజ ఒడెయార్‌ బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారే విజయం సాధించారు. శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్‌ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో కాంగ్రెస్‌ పారీ్టలో చేరి మైసూరు ఎంపీగా పార్లమెంట్‌కు పోటీ చేసి మొదటిసారి విజయం సాధించారు.

అనంతరం 1991లో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ రాకపోవడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రప్రభ అరసుపై ఓటమి చవి చూశారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1996, 1999లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించారు.

2004 ఎన్నికలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సీహెచ్‌ విజయశంకర్‌పై ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలను దూరంగా ఉన్నారు. శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడెయార్‌ మరణాంతరం రాజవంశానికి చెందిన వారు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు.

అయితే రాజమాత ప్రమోదాదేవి రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. ఆమె అయిష్టత చూపారు. 2015 ఫిబ్రవరి 23న యదువీర్‌ కృష్ణరాజ చామరాజ ఒడెయార్‌ను ప్రమోదాదేవి దత్తత తీసుకున్నారు. యదువంశానికి చెందిన 27వ యువరాజు శ్రీకంఠదత్త ఒడెయార్‌కు సంతానం లేదు. ప్రస్తుతం ఆయన దత్త కుమారుడు యదువీర్‌ మైసూరు–కొడగు పార్లమెంట్‌ నియోజకర్గానికి పోటీ చేసి విజయం సాధించారు.

యదువీర్‌కు 1.30 లక్షల మెజారిటీ 
కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌కు 6,56,241 ఓట్లు, యదువీర్‌కు 7,95,503 ఓట్లు వచ్చాయి. యదువీర్‌కు 1,39,262 ఓట్ల మెజారిటీ లభించింది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)