Breaking News

మన్మోహన్‌కు అంతర్జాతీయ మీడియా నివాళులు

Published on Sat, 12/28/2024 - 06:39

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది. 

ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ 
1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్‌సింగ్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. 

పదవులు నచ్చని రాజు: రాయిటర్స్‌ 
మన్మోహన్‌ సింగ్‌.. పదవులు నచ్చని రాజు. భారత్‌లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. 

దూరదృష్టిగల నేత: న్యూయార్క్‌ టైమ్స్‌  
మన్మోహన్‌సింగ్‌ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్‌తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు.  
సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్‌ పోస్ట్‌ 
మన్మోహన్‌సింగ్‌ టెక్నోక్రాట్‌ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్‌–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్‌ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. 

భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్‌బర్గ్‌  
మన్మోహన్‌సింగ్‌ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. 

ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ 
ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్‌సింగ్‌ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్‌ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి. 

సౌమ్యుడైన నాయకుడు: అల్‌ జజీరా  
మన్మోహన్‌ సింగ్‌ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్‌. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)