Breaking News

‘పొగ తాగడం’ తగ్గింది

Published on Thu, 10/09/2025 - 04:55

ప్రపంచవ్యాప్తంగా ధూమపానం తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసేవారి సంఖ్య 2000 సంవత్సరంలో 138 కోట్లు. 2024 వచ్చేసరికిఈ సంఖ్య 120 కోట్లకు పడిపోయింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడినవారిలో ప్రతి ఐదుగురులో ఒకరు పొగతాగుతున్నారు.నివారించగల ముప్పు అయినప్పటికీ ధూమపానం ఏటా కోట్లాది మంది ప్రాణాలు తీస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

అంతర్జాతీయంగా 2000–2024 మధ్య.. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభాలో ధూమపానం చేసేవారు, అలాగే 2030 నాటికి దీని వినియోగం ఎలా ఉండబోతోంది అన్న అంచనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక రూపొందించింది. మొదటిసారిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచవ్యాప్తంగా ఈ–సిగరెట్‌ వినియోగాన్ని అంచనా వేసింది. ఈ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. 

ముప్పుగా ఈ–సిగరెట్స్‌
ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికిపైగా ప్రజలు వేపింగ్‌ చేస్తున్నారు. ఈ–సిగరెట్స్, వేప్‌ పెన్స్, మోడ్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా ఏరోసోల్‌ (ఆవిరి) పీల్చడాన్ని వేపింగ్‌ అంటారు. వేపింగ్‌ ప్రక్రియలో పొగాకుకు బదులు నికోటిన్, ఫ్లేవర్లు, ఇతర రసాయనాలు కలిగి ఉన్న ద్రవం (ఈ–లిక్విడ్‌) వాడతారు. క్యాన్సర్‌ కారకాలతో సహా హానికర రసాయనాలు ఏరోసోల్‌లో ఉంటాయి. 

వేపింగ్‌తో శ్వాస సమస్యలు, అవయవ నష్టం వంటి తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి. భారత్‌లో ఈ–సిగరెట్‌ తయారీ, వాడకం నిషేధం. నికోటిన్  వ్యసనంగా మారడానికి ఈ–సిగరెట్లు కారణమని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. పిల్లలు నికోటిన్ కు బానిసలవుతున్నారని, ఇవి దశాబ్దాల పురోగతిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.  

మహిళలే ముందంజలో..
2000–24 మధ్యకాలంలో అన్ని వయసుల వారిలో ధూమపానంలో స్థిరమైన తగ్గుదల ఉన్నప్పటికీ.. పురుషులతో పోలిస్తే మహిళలు ముందంజలో ఉన్నారు. 2025 సంవత్సరానికిగాను నిర్దేశించుకున్న ప్రపంచ తగ్గింపు లక్ష్యాన్ని ఐదేళ్లకు ముందే మహిళలు చేరుకున్నారని నివేదిక తెలిపింది. పురుషులు ఈ లక్ష్యాన్ని 2031 వరకు చేరుకోలేరని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా. 

మహిళల్లో ధూమపానం వ్యాప్తి 2010లో 11% నుంచి 2024లో 6.6%కి తగ్గింది. పొగతాగే మహిళల సంఖ్య 2010లో 27.7 కోట్లు ఉండగా.. 2024లో 20.6 కోట్లకు తగ్గిపోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పొగతాగేవారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి పైగా పురుషులే. మగవారిలో  ధూమపానం చేసేవారి సంఖ్య 2010లో 41.4% నుంచి 2024లో 32.5%కి తగ్గినప్పటికీ మార్పు వేగం చాలా నెమ్మదిగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది.

భారత్‌లో ఇలా..
15 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో పొగ తాగుతున్నవారు 24.35 కోట్లు
పురుషులు 19.4కోట్లు
స్త్రీలు 4.93కోట్లు
2025లో ప్రపంచ జనాభాలో ధూమపానం వ్యాప్తి అంచనా 21.9%
2000లో వ్యాప్తి అంచనా  49.8%
2030 నాటికి పొగ తాగేవారి వ్యాప్తి అంచనా 18.8%
ప్రపంచవ్యాప్తంగా ఈ–సిగరెట్స్‌ వాడుతున్నవారు 10 కోట్లు
13–15 ఏళ్ల వయసున్న ఈ–సిగరెట్‌ వినియోగదారులు 1.5 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు ఆపై వయసువారిలో పొగ తాగుతున్నవారు..    
సంవత్సరం    స్త్రీలు        పురుషులు
    2010      11%        41.4%
    2024       6.6%        32.5%

ప్రాంతాలవారీగా ధూమపాన ప్రియుల శాతం
యూరప్‌ 24.1
ఆగ్నేయాసియా 23.4
పశ్చిమ పసిఫిక్‌ దేశాలు 22.9
అమెరికా 14
ఆఫ్రికా 9.5

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?