Breaking News

పర్యావరణ పరిరక్షణే మన సంస్కృతి

Published on Fri, 06/05/2026 - 10:52

భారతదేశంలో అనాది నుంచి కూడా భూమిని భూమాతగా కొలుస్తున్నారు. వృక్షా లను, పశువులను పూజిస్తున్నారు. అంటే భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ప్రకృతి– పర్యావరణం ఒక విడదీయలేని భాగం. మొక్కలు నాటడం, సహజ వనరులు వాడటంలో పొదుపు; వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత భారతీయ జీవన విధానంలో అంత ర్భాగంగా కొనసాగుతున్నాయి. అయితే ఆధునిక కాలం పోకడల కారణంగా మన జీవన శైలిలో కూడా మార్పులు వచ్చాయి. ఫలితంగా పంచభూతాలను కలుషితం చేస్తున్నాము. నిజానికి ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాలు మన శరీరం పంచభూతాత్మకం (భూమ్యాకాశాలు, గాలి, నీరు, అగ్ని) అని పేర్కొంటున్నాయి. ఈ పంచభూతాలను నాశనం చేస్తున్నామంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే కదా! అందుకే పర్యావరణంలో భాగమైన పంచభూతాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లే లెక్క. 

ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, సునామి, భూకంపాలు వంటివి అన్నీ కూడా భూతాపం పెరిగి వాతావరణంలో అసమానతలు ఏర్పడి నందువలన వస్తున్నాయి. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా మానవుడు ప్రకృతిని విచక్షణా రహితంగా కొల్లగొట్టడమే. అలాగే ప్లాస్టిక్‌ వాడకాన్ని అధికం చేయడం కూడా మరో కారణం. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్‌ పదార్థాలను 2040 కల్లా 60 శాతానికి  తగ్గించాలని పిలుపు ఇవ్వడం ఈ సదర్భంగా గమనార్హం. భూతాపానికి కారణమైన ఇంధనాల వినియోగాన్ని తగ్గించి ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోలియం వాడకాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఈ చర్యల ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, మన సంస్కృతిని కూడా రక్షించుకున్నట్లవుతుంది. 

– ప్రొ. వై.వి. రామిరెడ్డి 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)