Breaking News

లోదుస్తులు చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

Published on Wed, 10/23/2024 - 08:30

అజ్మీర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గత మూడు నెలలుగా వింత చోరీలు జరుగుతున్నాయి. రాత్రి వేళ్లలో ఇళ్లలోకి చొరబడిన దొంగలు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారు. మూడు నెలలుగా ఇదే తంతు జరుగుతుండటంతో విసుగెత్తిన స్థానికులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అజ్మీర్‌లోని విజయనగర్‌ ప్రాంతానికి చెందిన మహిళలు గత మూడు నెలలుగా తమ లోదుస్తులు మాయయవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో దీనిపై మౌనం వహించిన వారు  పలు ఇళ్లలో ఇదే తరహా దొంగతనాలు తరచూ జరుగుతుండటంతో చివరికి పోలీసులను ఆశ్రయించారు. విజయనగర్ నివాసి లక్ష్మీకాంత్ చిపా మాట్లాడుతూ లోదుస్తుల దొంగ కారణంగా ఈ ప్రాంతంలోని మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలోని పలు ఇళ్లలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇళ్లలోకి చొరబడుతున్న దొంగలు పలు విలువైన వస్తువులతోపాటు మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నారని అన్నారు. ఈ  ఉదంతంపై బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలించారు. దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  

ఈ చోరీల ఘటనపై స్థానిక మహిళ ఒకరు మాట్లాడుతూ  మహిళల లోదుస్తుల చోరీ కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఆ దొంగల ఆంతర్యం ఏమిటో  అర్థం కావడంలేదని, ఈ తరహా దొంగలు తమపై ఎక్కడ దాడి చేస్తారోనని భయపడుతున్నామన్నారు. 

ఇది కూడా చదవండి: బీరూట్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడి.. 12 మంది మృతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)