Breaking News

ఆకలిని తట్టుకోలేక గడ్డి తిని యువతి మృతి..!

Published on Sun, 07/26/2026 - 08:13

అన్నానగర్‌ (చెన్నై): తిరువళ్లూరు జిల్లాలోని గుమ్మిడిపూండి–రెట్టంపేడు రహదారి పై ఆత్తుపాక్కం గ్రామం ఉంది. ఆర్యతమ్మన్‌ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైందని గ్రామ పరిపాలనా అధికారి రమేష్‌ శనివారం ఉదయం గుమ్మిడిపూండి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని తరువాత, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. ఆ సమయంలో, ఆలయ ద్వారం వద్ద పడి ఉన్న మృతదేహం ఉత్తర రాష్ట్రానికి చెందిన సుమారు 30 ఏళ్ల యువతిదని వెల్లడైంది. 

ఆమె ఎవరు? ఏ గ్రామానికి చెందినది అని తెలియదు. ఆమె గడ్డి తిన్నందున ఆమె నోరంతా గడ్డితో నిండి ఉంది. ఆకలితో గుడి గేటు వద్ద గడ్డి మొక్కలు తిన్నడం తో ఆ యువతి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆ మహిళ ఆ ప్రాంతంలో తిరుగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. గుమ్మిడిపూండి పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)