Breaking News

సీఐ గారు మీరంటే నాకు మోజు..!

Published on Thu, 12/18/2025 - 07:27

కర్ణాటక: ఇక్కడ అంతా రివర్స్‌ అయ్యింది. ఓ పురుష సీఐని మహిళ ప్రేమపేరుతో వేధిస్తోందని తెలిసింది. బెంగళూరులోని రామమూర్తినగర ఠాణా సీఐ సతీష్‌ కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. తాను అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలినని, ప్రేమించకపోతే ఇబ్బంది పడతావని కూడా బెదిరిస్తూ ప్రముఖులతో తీసుకున్న ఫోటోలను వాట్సాప్‌లో పంపి సతాయిస్తోంది.  

ఎలా మొదలైంది..  
సదరు మహిళ పని మీద ఒకటి రెండుసార్లు ఠాణాకు వచ్చి సీఐతో మాట్లాడింది, అంతే అప్పటి నుంచి ఆయనంటే మోజు పడింది. ప్రేమగా కజ్జికాయల డబ్బా, పూల బొకే తీసుకుని సీఐ కోసం వస్తుంది. మొదట్లో మామూలే కదా అనుకున్న సీఐకి తరువాత సీరియస్‌ అని అర్థమైంది. సుమారు 11 నంబర్ల నుంచి ఫోన్‌ చేసి, ప్రేమించాలని డిమాండ్‌ చేస్తోందని ఠాణా సిబ్బంది చెబుతున్నారు. నన్ను ప్రేమించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, మీరే కారణమని డెత్‌నోట్‌ రాస్తాను అని బెదిరిస్తూ రక్తంతో మరో లేఖను రాసింది.    

మహిళపై కేసు 
ఈ చర్యలతో విసుగెత్తి ఇన్స్‌పెక్టర్‌ సతీశ్‌.. తన విధులకు అడ్డుపడుతున్న, ఆత్మహత్య బెదిరింపులకు పాల్పడుతున్న సెక్షన్ల కింద ఆమె మీద కేసు నమోదు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు.  

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)