Breaking News

పిల్లే కదా అనుకుంటే..

Published on Sat, 08/10/2024 - 09:49

శివమొగ్గ: ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి కరవడంతో రేబిస్‌ వ్యాధి బారిన పడి మహిళ మరణించిన ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకా తరలఘట్ట గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గృహిణి గంగీబాయి (44) అనే మహిళ రెండు నెలల క్రితం ఇంట్లో చూసుకోకుండా పిల్లి తోకపై కాలు వేసింది.

అప్పుడు పిల్లి ఆమె కాలుపై కరిస్తే, ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందింది. రేబిస్‌ సోకుండా ముందు జాగ్రత్తగా ఐదు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి ఉండగా ఒక ఇంజెక్షన్‌ను మాత్రమే తీసుకుని ఏమీ కాదులే అని ఊరుకుంది. పది రోజుల క్రితం ఆమె ఉన్నఫళంగా అనారోగ్యం బారిన పడటంతో శికారిపుర తాలూకా ఆస్పత్రిలో, ఆపై శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృత్యువాత పడినట్లు జిల్లా సీజనల్‌ వ్యాధుల నియంత్రణాధికారి డాక్టర్‌ మల్లప్ప తెలిపారు. 

పెంపుడు జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని యాంటిబయాటిక్‌ ద్రవం, లేదా సబ్బుతోనైనా శుభ్రంగా కడగాలన్నారు. తరువాత సమీప ఆస్పత్రికి వెళ్లి నెల రోజుల్లో నాలుగు రేబిస్‌ ఇంజెక్షన్లను వేయించుకోవాలని, అప్పుడే రేబిస్‌ నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. పిల్లి, కుక్క వంటి జంతువుల కాట్లపై నిర్లక్ష్యం వద్దని ప్రజలకు సూచించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)