Breaking News

కవలలకు జన్మనిచ్చిన బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితురాలు

Published on Tue, 09/10/2024 - 07:54

ఇండోర్‌(మధ్యప్రదేశ్‌): ప్రాణాంతక బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితురాలు కవలలకు జన్మనిచ్చారు. ప్రపంచంలోనే ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మైయెలాయిడ్‌ లుకేమియా అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్‌తో బాధ పడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా చూడటం సవాల్‌తో కూడుతున్న వ్యవహారమని ఆస్పత్రిలోని క్లినికల్‌ హెమటాలజీ విభాగం ప్రొఫెసర్‌ అక్షయ్‌ లహోటీ తెలిపారు.

 ‘ఈ గర్భవతిని మా ఆస్పత్రిలో చేరి్పంచిన సమయంలో ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల(డబ్ల్యూబీసీ)సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో, కీమో థెరపీతోపాటు సాధారణ క్యాన్సర్‌ మందులు ఇవ్వలేకపోయాం’అని ఆయన చెప్పారు. ‘దేశ, విదేశాల్లోని నిపుణులను సంప్రదించాక ఆమె ఆరోగ్యంతోపాటు గర్భంలోని ఇద్దరు శిశువులకు ఎటువంటి హాని వాటిల్లకుండా ప్రత్యేకంగా మందులు ఇచ్చాం’అని లహోటీ తెలిపారు. 

‘మొదటిసారి గర్భం దాలి్చన బాధితురాలికి బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్న విషయం చెప్పలేదు. గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఆమెకు సాధారణ ప్రసవం చేశాము. బాబు, పాప జని్మంచారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు’ అని గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సుమిత్రా యాదవ్‌ వివరించారు. మైయెలాయిడ్‌ లుకేమియా ఉన్న మహిళలకు సురక్షిత ప్రసవం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు.   

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)