Breaking News

కుక్కర్‌తో కొట్టి చంపేశారు..

Published on Thu, 12/18/2025 - 14:37

ఆధునిక సమాజంలో మనుషులు ఉచ్చం నీచం మర్చిపోతున్నారు. మానవత్వానికే మచ్చతెచ్చేలా ప్రవర్తిస్తున్నారు.  రెంట్‌ అడిగిన పాపానికి ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన కలకలం  రేపింది. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో  జరిగిన ఈ సంఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌ లోని ఆరా చిమెరా నివాస సముదాయంలో ఈ సంఘటన జరిగింది.  ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు గత నాలుగు నెలలుగా అద్దె  చెల్లించపోవడంతో 
ఇంటి యజమాని దీప్‌శిఖా శర్మ (48)  వారిని అద్దె బకాయి చెల్లించమని అడిగింది. అంతే మరునాటికి సూట్‌కేస్‌లో శవమై  తేలింది.


అద్దెకు అడిగినప్పుడు ఇంటి యజమానిని హత్య చేసినందుకు ఒక జంటను అరెస్టు చేశారు. మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని సూట్‌కేస్ నుండి స్వాధీనం చేసుకున్నారు, ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

హత్య ఎలా జరిగింది?
ఉమేష్ శర్మ వ దీప్‌శిఖా శర్మ సొసైటీలో రెండు ఫ్లాట్‌లను కలిగి ఉన్నారు.  ఒక ఫ్లాట్లో వారు ఉంటూ, మరొకదానిని అద్దెకిచ్చారు. ఇందులో  అజయ్ గుప్తా , అకృతి గుప్తా దంపతులు నివసిస్తున్నారు. అజయ్ గుప్తా రవాణా వ్యాపారంలో ఉన్నాడు. నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన దీప్‌ శిఖబుధవారం, గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో, ఆమె భర్త ఇంట్లో లేడు. అయితే దీప్‌శిఖ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పని మనిషి మీనా ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే గుప్తా దంపతుల ఇంటికి వెళ్ళి ఆరా తీసింది. అప్పుడు వారి ప్రవర్తన, సమాధానాలు అనుమానాన్ని రేకెత్తించాయి. మీనా  సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేయించగా, దీప్‌ శిఖా, గుప్తా దంపతుల ఇంట్లోకి వెళ్లింది గానీ, బయటకు రాలేదని గుర్తించి అప్పుడు పోలీసులకు  సమాచారం అందించింది.

ఈలోపు విషయం తెలుసుకొని అప్రమత్తమైన గుప్తా దంపతులు మరో  పెద్ద ప్లాన్‌వేశారు. కానీ మీనా సమయ స్ఫూర్తితో వారి ఆటలు సాగలేదు. ఒక పెద్ద సూట్‌ కేసుతో బయటికి రావడం, ఆటోకి  ఫోన్‌ చేయడం చూసి  మీనా వారిని అడ్డుకుంది. పోలీసులు వచ్చిన తర్వాత, గుప్తా దంపతుల ఇంటిని సోదా చేయగా, దిగ్భ్రాంతికరమైన విషయం టైటపడింది. బాధితురాలి మృతదేహం సూట్‌కేస్‌లో గుర్తించారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో   కుక్కి ఎక్కడో పారవేయాలనే వారి ప్లాన్‌ . పనిమనిషి వారి  ప్లాన్‌ను  భగ్నం చేసింది.

దీప్‌ శిఖను ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి, ఆపై దుపట్టాతో గొంతు కోసి చంపారని పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబంపోలీసులకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీనియర్ పోలీసు అధికారి ఉపాసన పాండే తెలిపారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)