Breaking News

Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు

Published on Wed, 01/08/2025 - 09:16

దేశంలో చలివాతావరణం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో  అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలంలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఆయా ప్రాంతాలకు వెళితే బిజీలైఫ్‌ నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

మనదేశంలో శీతాకాలంలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడ చలిని కూడా ఎంజాయ్‌ చేయవచ్చు. ప్రతీయేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏవి? ఎక్కడున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గోవా
ప్రకృతి అందాలకు నిలయమైన గోవా.. స్వదేశీ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానం. అందమైన సముద్రం, బీచ్, నైట్ లైఫ్, పార్టీలు, వినోదాన్ని ఇష్టపడేవారు వింటర్ సీజన్‌లో గోవాను సందర్శిస్తే మంచి అనుభూతి దొరుకుతుంది. గోవా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గోవాకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు.  లేదా ఒంటరిగా నైనా వెళ్లవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గోవాలో అత్యంత రమణీయమైన వాతావరణం కనిపిస్తుంది.

జైసల్మేర్
శీతాకాలంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ప్రకృతిశోయగాలతో మరింత సుందరంగా తయారవుతుంది. జైసల్మేర్‌లో చారిత్రక వారసత్వం, సంస్కృతి రెండూ కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, నైట్ అవుట్, ఒంటె సవారీ తదితర వినోద కార్యకలాపాల్లో పాల్గొని, ఎంజాయ్‌ చేయవచ్చు.  చలికాలంలో జైసల్మేర్‌ను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.

కూర్గ్
కర్ణాటకలో ఉన్న కూర్గ్ అధికారిక పేరు కొడగు. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. చలికాలంలో కూర్గ్‌లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇక్కడి విశేషం. దేశమంతటా అత్యధిక చలివున్న సమయంలో కూర్గ్‌లో వెచ్చదనాన్ని అనుభవించవచ్చు. కూర్గ్‌లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.

ముంబై
వింటర్ సీజన్‌లో ముంబైని కూడా సందర్శించవచ్చు. ఇక్కడి బీచ్‌లో బలమైన అలలను చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. ముంబైలో సందర్శించేందుకు పలు పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడి స్ట్రీట్‌ ఫుడ్‌ను ఆహార ప్రియులను అమితంగా ఇష్టపడుతుంటారు. ముంబైలో సందర్శించేందుకు పలు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శీతాకాలంలో తక్కువ బడ్జెట్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందుకు ముంబై అనువైన ప్రాంతమని పర్యాటకులు చెబుతుంటారు. 

ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)