Breaking News

జమ్ముకశ్మీర్‌లో సున్నా డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు

Published on Thu, 11/21/2024 - 13:00

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో  చలి మరింతగా పెరవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

శ్రీనగర్‌లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత -0.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నవంబర్ 23 వరకు కశ్మీర్‌లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 24న వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -2.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, పహల్గామ్‌లో -3.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. షోపియాన్‌లో-3.9 డిగ్రీల  కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గుల్‌మార్గ్‌లో ఉష్ణోగ్రత 0.0 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో -0.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. కోకర్నాగ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత  0.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. బందిపొరలో -2.4 డిగ్రీల సెల్సియస్, బారాముల్లా -0.4 డిగ్రీల సెల్సియస్, బుద్గామ్ -2.1 డిగ్రీల సెల్సియస్, కుల్గామ్ -2.6 డిగ్రీల సెల్సియస్, లార్నులో -3.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ‍ప్రతికూలమా?
 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు