జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
Breaking News
SpiceJet: గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్
Published on Thu, 07/03/2025 - 07:47
ముంబై: గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్ క్యూ400 విమానం కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలుస్తోంది. పుణెలో విమానం ల్యాండవగానే ఊడిన కాస్మెటిక్ ఇంటీరియర్ కిటికీ ఫ్రేమ్‌ను బిగించామని స్పైస్‌జెట్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
అయితే ఈ ఘటనను ఆ విమాన ప్రయాణికులు తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ముందుస్తు తనిఖీలు చేయకుండా విమానాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ కిటికీ అసెంబ్లీ యూనిట్ మొత్తం ఊడిపోయింది. అయినాసరే విమానాన్ని అలాగే పోనిచ్చారు. అసలీ విమానాన్ని ఎగిరే అర్హత ఉందా?’’ అంటూ ఒక ప్రయాణికుడు సంబంధిత కిటికీ ఫొటోను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు ట్యాగ్చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.
#SpiceJet from Goa to Pune today. The whole interior window assembly just fell off mid flight. And this flight is now supposed to take off and head to Jaipur. Wonder if it’s air worthy @ShivAroor @VishnuNDTV @DGCAIndia pic.twitter.com/x5YV3Qj2vu
— Aatish Mishra (@whatesh) July 1, 2025
Tags : 1