Breaking News

మనిషిలా మాత్రమే జీవిస్తా 

Published on Mon, 10/13/2025 - 06:08

గువాహటి: అసోంలోని గువాహటిలో గాయకుడు జుబీన్‌ గార్గ్‌కు దహన సంస్కారాలు జరిపి ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ బ్రాహ్మణ యువకుడు.. ‘ఇకపై కేవలం మనుషులా మాత్రమే జీవిస్తా. కులమతాల ప్రస్తావన వదిలేస్తా’అంటూ తన జంధ్యాన్ని తెంపి, చెత్తలో పడేశాడు. సన్‌ భగవతి అనే 30 ఏళ్ల ఆ యువకుడు.. ఇకపై గార్గ్‌ నడిచిన బాటలోనే నడుస్తానని తెలిపాడు. కులమతాల అడ్డుగోడలను పగులగొట్టాలన్నాడు.

 ‘పుట్టుకతో నా కులం బ్రాహ్మణ. ఇప్పుడిక నాకు కులం, మతం అంటూ ఏదీ లేదు’అంటూ తన దుస్తుల్లోపలున్న జంధ్య తీసి, మీడియా చూస్తుండగానే తెంచి చెత్తలోకి వేశాడు. నా సోదరుడు జుబీన్‌ సాక్షిగా చెబుతున్నా. జంధ్యం మళ్లీ ధరించను. ఇటీవల సోషల్‌ మీడియాలో హిందూముస్లింలకు సంబంధించిన అంశాలే ప్రముఖంగా వస్తున్నాయి. హిందువుల్లోనూ చాలా కులాలున్నాయి. శూద్రుడు ఇచ్చిన వాటిని బ్రాహ్మణుడు పట్టుకోడు.

 ఇలాంటి ఆచారాలు, విశ్వాసాలు ఎన్నో. అందుకే జబీన్‌ దా సాక్షిగా వాటన్నిటినీ వదిలేస్తున్నా. ఆరేళ్ల నా కుమారుడికి కూడా జంధ్య వేయను. మనుషుల్లాగా జీవించడం మనం నేర్చుకోవాలి. మానవత్వం అన్నిటికీ మించింది’అని పేర్కొన్నాడు. కాగా, బ్రాహ్మణ కుటుంబంలో జి»ొన్‌ బొర్తాకుర్‌ పేరుతో జని్మంచిన జుబీన్‌ గార్డ్‌ కూడా తనకు కులం–మతం లేదంటూ ప్రకటించుకున్నారు. జంధ్యాన్ని దోమ తెర కట్టేందుకు తాడు మాదిరిగా వాడుకున్నట్లు గతంలో ఓ సందర్భంలో తెలిపారు.  
 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి