Breaking News

‘ఆటోమేటిక్‌ డోర్‌కు అలవాటు పడలేదు’

Published on Wed, 04/03/2024 - 14:17

‘వందే భారత్‌’ రైలులో ప్రయాణించాలని ఎవరికి ఉండదు చెప్పండి? ఆధునిక సౌకర్యాలతో తళతళలాడుతున్న ఈ రైలు ఎక్కాలని చాలామంది తహతహలాడిపోతుంటారు. అయితే ఈ రైలులోని కొన్ని సాంకేతిక విషయాలు తెలియక కొందరు చిక్కుల్లో పడుతున్నారు. 

సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా రైలు ప్రయాణానికి బయలుదేరినప్పుడు వారిని దిగబెట్టేందుకు తోడుగా ఎవరో ఒకరు వెళుతుంటారు. ఇదేవిధంగా ఒక భర్త తన భార్యను వందేభారత్‌ రైలు ఎక్కించేందుకు వెళ్లాడు. ఆమె తన సీటులో కూర్చున్నాక భర్త కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే ఇంతలో వారుంటున్న కోచ్‌ డోర్‌ ఆటోమేటిక్‌గా క్లోజ్‌ అయిపోయింది. మరి అప్పుడేం జరిగింది?

వివరాల్లోకి వెళితే ఒక మహిళ తన కుమార్తె దగ్గర ఉండేందుకు తొలిసారిగా వందే భారత్ రైలులో గుజరాత్‌లోని వడోదర నుంచి ముంబైకి బయలుదేరింది. ఆ మహిళకు తోడుగా స్టేషన్‌ వరకూ ఆమె భర్త వచ్చాడు.  లగేజీని ఆమె కూర్చున్న సీటు దగ్గర ఉంచి, కాసేపు కూర్చున్నాడు. ఇంతలో రైలు తలుపులు మూసుకుపోయిన శబ్ధం వినిపించింది. ఆ వ్యక్తి రైలు దిగకముందే డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి టీసీతో మాట్లాడి రైలును ఆపాలనుకున్నాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో రైలు వేగం అందుకుంది. దీంతో ఆ వ్యక్తి తనకు ఇష్టం లేకపోయినా తదుపరి స్టేషన్ వచ్చే వరకు ప్రయాణించవలసి వచ్చింది. అతని కుమార్తె తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది.

ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ కొన్ని లక్షలమంది వీక్షించారు. ఈ పోస్ట్ చూసిన  ఒక  యూజర్‌.. ‘అతను స్టేషన్‌లోని నో పార్కింగ్ జోన్‌లో పెట్టిన తన కారు గురించి ఆందోళన చెందుతున్నాడేమోనని’ రాయగా, మరొక యూజర్‌ ‘ఇది అతనికి అందమైన జ్ఞాపకంగా మిగులుతుందని’ రాశాడు. మరో యూజర్‌ ‘అతనింకా  ఆటోమేటిక్ డోర్‌కు అలవాటుపడలేదని’ పేర్కొన్నాడు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)