Breaking News

మంచు సున్నితం.. వడగళ్లు కఠినం.. ఆకాశంలో ఏం జరుగుతుంది?

Published on Thu, 12/19/2024 - 10:25

శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంటుంది. ఈ మంచును ముట్టుకున్నప్పుడు ఎంతో సున్నితంగా ఉంటుంది. తాకగానే మంచి మెత్తని పూలను తాకిన అనుభూతినిస్తుంది.  ఇదేవిధంగా వర్షాకాలంలో చాలా ప్రాంతాల్లో వడగళ్లు పడుతుంటాయి. అవి ఎంతో గట్టిగా రాళ్లలా ఉంటాయి. వెంటనే కరిగిపోవు. ఒకే ఆకాశం నుంచి పడే మంచు మృదువుగా, వడగళ్లు గట్టిగా ఎందుకు ఉంటాయి. దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతుంది?

మంచు ఎందుకు కురుస్తుంది?
చలికాలంలో రాత్రి వేళ భూమి అధికంగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి క్రమంగా వాతావరణపు పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి మరింత చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. వాటికి దుమ్ము, ధూళి లాంటి అతి చిన్న కణాలు ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుంది. దీనినే పొగమంచు అంటారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా  కనిపిస్తుంది. చలికాలంలో భూమి అధికంగా చల్లబడడం వలన నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. అవే మెరిసే మంచు బిందువులుగా కనిపిస్తాయి.

వడగళ్లు ఎలా ఏర్పడతాయంటే..
మేఘాల్లో ఉండే నీరు వాతావరణ మార్పులకు కరిగి భూమిపై పడడాన్నే వర్షం అని అంటారు. సాధారణంగా మేఘాల్లోని నీరు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద సూపర్ కూల్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఇది చిన్న చిన్న మంచు ముక్కలుగా మారి వర్షంగా కురుస్తుంది. అయితే ఆ మంచు ముక్కలు నేలను చేరుకునే సరికి గాలి తాకిడికి నీరుగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ మంచు ముక్కలు  గట్టిగా తయారై వడగళ్లుగా వర్షంతో పాటు కిందకు పడతాయి.

ఎక్కువ ఎత్తులో ఉంటూ బలమైన ఉరుములతో కూడిన మేఘాలు వర్షించినప్పుడు మేఘంలోని సూపర్‌కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా కింది నుంచి గాలి పైకి ఒత్తిడి తెచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ముక్కలు కింద పడకుండా తిరిగి మేఘాలపైకి వెళ్తాయి. ఈ క్రమంలో ఆ మంచు ముక్కలకు మరింత సూపర్‌ కూల్డ్ వాటర్‌ తోడవడంతో మరికొన్ని మంచు ముక్కలు దగ్గరగా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య జరుగుతున్న కొద్దీ  మంచు ముక్కలు ఇంకా పెద్దవిగా రూపాంతరం చెందుతుంటాయి. వీటినే మనం వడగళ్లు అని అంటాం. మేఘం నుంచి వర్షం కురిసేటప్పుడు కొన్ని వడగళ్లు మధ్యలోనే కరుగుతాయి. పెద్ద మంచు ముక్కలు మాత్రం కరగకముందే నేలను చేరుతుంటాయి. వాతావరణ పరిస్థితుల్లో నిలకడ లేనప్పుడు ఇలాంటి వడగళ్ల వానలకు అవకాశం ఉంటుంది.



ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)