Breaking News

పిల్లల చేత దివిటీలు ఎందుకు కొట్టిస్తారంటే..

Published on Thu, 10/31/2024 - 09:44

దీపావళి పండుగ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తూ పిల్లలు ఎంతో హడావుడి చేస్తుంటారు. దీపావళి వేళ ఎటుచూసినా దీపాల వెలుగులు కనిపిస్తాయి. దీపావళి నాడు చిన్న పిల్లల చేత పెద్దలు దివిటీలు కొట్టిస్తారు. దీనివెనుక ఒక పరమార్థం ఉంది.

దీపావళి రోజున పిల్లల చేత దివిటీలు కొట్టించడం  ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ దివిటీలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.  గోగు కర్రలకు నూనెలో నానబెట్టిన ఒత్తిని కట్టి, దానిని దీపంతో వెలిగిస్తారు. పిల్లలకు ఆ కర్రలను ఇచ్చి, పెద్దలు తమ సమక్షంలో ఆ దివిటీలను కొట్టిస్తారు. ఈ సమయంలో వాటిని గాలిలో గుండ్రంగా మూడుసార్లు తిప్పుతారు. ‘దిబ్బు దిబ్బు దీపావళి మళ్లీ వచ్చే నాగుల చవితి’ అని పిల్లల చేత పాలు పాడిస్తూ  ఈ వేడుక చేస్తారు.

ఈ దివిటీలు కొట్టించే కార్యక్రమం ముగిశాక పిల్లల కాళ్లు చేతులు కడిగి  స్వీట్స్ తినిపిస్తారు. అనంతరం పిల్లల చేత టపాసులు కాల్పిస్తారు. ఈ దివిటీలు కొట్టించడం వెనుకనున్న అంతరార్థం విషయానికొస్తే..  దీపావళి రోజున పితృదేవతలు సంధ్యా సమయంలో ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి తమ గృహాలను చూస్తారట. వారికి ఆహ్వనం పలుకుతున్న రీతిలో దివిటీలను కాలుస్తారని పండితులు చెబుతారు. ఇది పూర్వకాలం నుంచి  ఏర్పడిన సంప్రదాయం అని పెద్దలు చెబుతుంటారు.

ఇది కూడా చదవండి: సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిద్దాం ఇలా..!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)