Breaking News

కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌ మూర్తి ప్రమాణ స్వీకారం

Published on Thu, 11/21/2024 - 12:33

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) నూతన అధిపతిగా  కొండ్రు సంజయ్‌ మూర్తి  ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్‌ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.

ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్‌ అధిపతిగా ఉన్న గిరీశ్‌ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్‌ అధిపతిగా సంజయ్‌ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.

కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. కేఎస్‌ఆర్‌ మూర్తి 1996లో కాంగ్రెస్‌ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.

ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.  

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్‌ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)