Breaking News

గుడ్‌బై 2023: సుఖోయ్-30.. మిరాజ్-2000 ఢీకొన్న వేళ..

Published on Mon, 12/25/2023 - 08:59

కొద్దిరోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఆశలు రేకెత్తిస్తూ.. 2024 మన ముందుకు వస్తోంది. కొత్త సంవత్సరం ప్రజలకు కొత్త ఆనందాన్ని అందించబోతోంది. అయితే 2023 దేశ ప్రజలకు కొన్ని మంచి, కొన్ని చెడు జ్ఞాపకాలను అందించింది. 2023 జనవరి 28న గగనతలంలో ఊహకందని ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి చెందిన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు సుఖోయ్-30, మిరాజ్-2000 ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి.

ఈ రెండు యుద్ధ విమానాలు గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా ఎయిర్‌బేస్ నుండి సాధారణ శిక్షణ కోసం బయలుదేరాయి. ఈ ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలోని పహర్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మన్పూర్ మహాదేవ్ అడవిలో మిరాజ్ యుద్ధ విమానం కూలిపోయింది. సుఖోయ్‌కు చెందిన రెక్కలు మోరెనాలోని పహర్‌ఘర్ ప్రాంతంలో పడిపోయాయి. మిగిలిన విమానం రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని ఉచైన్ పోలీస్ స్టేషన్‌లోని నాగ్లా బిజా గ్రామ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో మిరాజ్ పైలట్ వింగ్ కమాండర్ హనుమంతరావు సారథి మృతి చెందగా, సుఖోయ్ పైలట్లిద్దరూ గాయపడ్డారు.

ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిరాజ్-2000 చాలా కాలంగా భారత వైమానిక దళంలో భాగంగా ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించారు. భారత వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం ఈ విమానాలు.. విమాన శిక్షణ మిషన్‌లో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ‍ప్రమాదంలో ఒక పైలట్‌ మృతి చెందగా, ఇద్దరు పెలట్లు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: దేశమంతటా క్రిస్మస్‌ వెలుగులు.. చర్చిలు శోభాయమానం!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)