Breaking News

పెద్ద సమస్యగా మారుతున్న USB ఛార్జర్ స్కామ్: నివారణ మార్గాలివే.. 

Published on Sat, 03/30/2024 - 20:05

టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లకు ఏ చిన్న అవకాశం దొరికినా చేతివాటం చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అనేకరకాలైన సైబర్ స్కామ్‌లలో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి. ఇది నేడు పెద్ద సమస్యగా అవతరిస్తోంది. దీంతో విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, బస్టాండ్‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పోర్టల్‌లను ఉపయోగించవద్దని కేంద్రం పౌరులను హెచ్చరించింది.

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు మరియు బస్టాండ్‌ల వంటి బహిరంగ ప్రదేశాల్లో USB ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. USB స్టేషన్‌లలో పరికరాలను ఛార్జింగ్ చేయడం వలన వినియోగదారులు జ్యూస్-జాకింగ్ సైబర్ దాడులకు గురవుతారు.

పబ్లిక్ ప్రదేశాల్లోని USB స్టేషన్‌లలో పరికరాలను ఛార్జింగ్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు అందులోని డేటాను దొంగలించవచ్చు. లేదా డివైజ్‌లలో మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేయడం వంటివి చేస్తారు. ఇలా ఒకసారి చేసిన తరువాత వ్యక్తిగత సమాచారం దొంగలించి బ్లాక్ మెయిల్ చేయడం వంటి వాటికి పాల్పడతారు. దీని ద్వారా వినియోగదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలాంటి సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడం ఎలా?

  • పబ్లిక్ ప్రదేశాల్లో ఇన్‌స్టాల్ చేసిన USB ఛార్జింగ్ పోర్ట్‌లను ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.
  • వ్యక్తిగత కేబుల్‌లు లేదా పవర్ బ్యాంక్‌లను మీ వద్ద ఉంచుకోవాలి
  • తెలియని డివైజ్‌లతో ఏమాత్రం ఛార్జ్ చేసుకోకూడదు, డివైజ్‌లను ఎప్పుడూ లాక్ చేసి ఉంచాలి.
  • మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడే ఛార్జ్ చేసుకోవడం ఉత్తమం
  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ మోసాలకు గురైతే.. సైబర్ క్రైమ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930కి కాల్ చేయాలి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)