Breaking News

ప్రాయశ్చిత్త పూజ ఏమిటి? అయోధ్యలో ఎందుకు చేస్తున్నారు?

Published on Tue, 01/16/2024 - 12:29

ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముందుగా నేడు (మంగళవారం)ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నారు. ఇంతకీ ‍ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

జీవితంలో ప్రతీఒక్కరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు. చేసిన తప్పులకు ఆ తరువాత పశ్చాత్తాప పడుతుంటారు. హిందూ ధర్మంలో వైదిక సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజించడానికి ప్రత్యేక నియమాలు, విధానాలు ఉన్నాయి. ఏదైనా మతపరమైన ఆచారాన్ని నిర్వహించే ముందు వాటిని పాటించడం తప్పనిసరి అని భావిస్తారు. అయితే పూజా విధానంలో పొరపాటున ఏవైనా  నియమాలను తప్పితే, తప్పు జరిగిందని బాధపడుతుంటారు. అందుకే దోష పరిహారం కోసం ముందుగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ తరహా పూజలతో భౌతిక, మానసిక, అంతర్గత ప్రాయశ్చిత్తం జరుగుతుందని పండితులు చెబుతారు. ప్రాయశ్చిత్త పూజలో భాగంగా 10సార్లు పుణ్య స్నానాలు చేస్తారు. బూడిదతో సహా వివిధ వస్తువులతో స్నానం చేస్తారు. ఈ పూజలో గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. బంగారం, వెండి, నగలు మొదలైనవి కూడా దానం చేస్తారు.

ప్రాయశ్చిత్త పూజలు చేయడం వలన ఎటువంటి దోషాలు అంటుకోవని చెబుతారు. అందుకే దేవాలయాలు నిర్మించినప్పుడు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు తప్పనిసరిగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. ఫలితంగా పూజల నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరిగినా దోషం తగలదని అంటారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి!

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)