Breaking News

బెంగాల్‌ రాజ్‌భవన్‌లో ఆయుధాలు

Published on Mon, 11/17/2025 - 03:55

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆనంద బోస్‌ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేశారని, బీజేపీ నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తు న్నారని టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. 

ఎన్నికల ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) చేపట్టడం ఎంతో అవసరమని గవర్నర్‌ ఆనందబోస్‌ శనివారం పేర్కొన్నారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం తిరిగి నెలకొంటుందన్నారు. ఆ వెంటనే ఎంపీ బెనర్జీ గవర్నర్‌పై దాడికి దిగారు.

 బీజేపీ నేరగాళ్లకు రాజ్‌భవన్‌లో ఆశ్రయం కల్పిస్తున్న గవర్నర్, వారికి బాంబులు, తుపాకులు సమకూర్చుతున్నారని ఆరోపణలు చేశారు. ఆయన ఆ పనిని వెంటనే ఆపేయాలని కోరారు. ఎంపీ బెనర్జీ ఆరోపణలపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల అవకాశాలను గవర్నర్‌ ఆనందబోస్‌ పరిశీలిస్తు న్నారని రాజ్‌భవన్‌ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ‘రాజ్‌భవన్‌ ఉదయం 5 గంటల నుంచి తెరిచే ఉంటాయి. 

బెనర్జీ వచ్చి తన ఆరోపణల మేరకు ఆధారాలుంటే పరిశీలించుకోవచ్చు. పౌరసంఘాల ప్రతినిధులు, జర్నలి స్టులు కూడా రావచ్చు. ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైతే న్యాయపరంగా ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఎంపీ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌కు కూడా లేఖ రాస్తాం’అని ఆ అధికారి చెప్పారు. భారతీయ న్యాయ సంహితలోని 151, 152, 353 సెక్షన్ల ప్రకారం ఎంపీ చర్యలు శిక్షార్హమైనవని ఆయన చెప్పారు. దీనిపై మళ్లీ ఎంపీ బెనర్జీ స్పందించారు. గవర్నర్‌ న్యాయపరంగా చర్యలు తీసుకుంటే తానేమీ చూస్తూ కూర్చోనన్నారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)