మ‌న చుట్టూ ఉన్న‌వి శ‌త్రుదేశాలే

Published on Fri, 11/28/2025 - 17:14

హైద‌రాబాద్, న‌వంబ‌ర్ 28, 2025: మ‌న చుట్టూ మ‌న‌కు అస్స‌లు స్నేహంగా లేని శ‌త్రుదేశాలే ఉన్నాయని.. వాళ్ల‌ను అర్థం చేసుకుని, వాళ్లేం చేస్తున్నారో గ‌మ‌నించ‌డం చాలా ముఖ్య‌మ‌ని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వినోద్ జి. ఖండారే అన్నారు. భార‌త ర‌క్ష‌ణ శాఖ‌కు మాజీ ముఖ్య స‌ల‌హాదారుగా ప‌నిచేసిన‌ ఆయ‌న‌.. గురువారం న‌గ‌రంలోని సిగ్మా ఎడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్ వారు కొత్త‌గా రూపొందించిన యాంటీ డ్రోన్ వెహికిల్ ఇంద్ర‌జాల్‌ను చూసి, ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలిపారు.

‘‘మీరంతా టెక్నాల‌జీలో ముందున్నందుకు అభినందిస్తున్నాను. మీ క‌ష్ట‌ప‌డేత‌త్వాన్ని, మంచి ప‌నిని కొన‌సాగించండి. త‌క్కువ ధ‌ర‌లో ఉండే ఈ స్మార్ట్ సొల్యూష‌న్లు మ‌న‌ల్ని శ‌త్రువుల కంటే ముందు ఉంచుతాయి.  పాత రోజుల్లో మ‌నం ఆత్మ‌ప్ర‌బోధాన్ని వినేవాళ్లం. మ‌న బ‌లాబ‌లాలు తెలుసుకునేవాళ్లం. అలాగే శ‌త్రుఘోష కూడా వినేవాళ్లం. దాన్నిబ‌ట్టి మ‌న శ‌త్రువు ఎవ‌రు, వాళ్ల బ‌లాబలాలేంటో తెలిసేది. మ‌న చుట్టూ మ‌న‌కు అస్స‌లు స్నేహంగా లేని దేశాలే ఉన్నాయి. మ‌నం వాళ్ల‌ని అర్థం చేసుకుని, వాళ్లేం చేస్తున్నారో తెలుసుకోవాలి.

మ‌న‌మంతా ఒక స‌మ‌ర్థ‌మైన ఆధునిక సైన్యం కోసం చూస్తున్నాం. ఇలాంటి స్టార్ట‌ప్‌లు, సిగ్మా లాంటివాళ్లు నిజ‌మైన సైనికులు. వీళ్లే ఎల్ఓసీలో గానీ, ఎల్ఏసీలో గానీ, అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల్లో గానీ, చివ‌ర‌కు  దేశం న‌డిబొడ్డున కూడా మ‌మ్మ‌ల్ని బ‌లోపేతం చేస్తున్నారు. వీళ్లు రూపొందించిన యాంటీ డ్రోన్ వాహ‌నం ఇంద్ర‌జాల్ లాంటివి మ‌న‌కు చాలా అవ‌స‌రం. ఆప‌రేష‌న్ ఇంద్ర‌జాల్ చాలా స్ఫూర్తిదాయ‌కం. ప్ర‌స్తుతం కైనెటిక్, నాన్ కైనెటిక్ యుద్ధాలు జ‌రుగుతాయి. 

స్లీప‌ర్ సెల్స్ దేశంలోకి ప్ర‌వేశించి దేశ ఆస్తుల‌ను నాశ‌నం చేస్తున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కౌంట‌ర్ డ్రోన్ ప‌రిష్కారాలు చాలా అవ‌స‌రం. ఇలాంటివాటి కోస‌మే మ‌నం చూస్తున్నాం. ఇవి మ‌న‌ల్ని ర‌క్షించ‌డంతో పాటు ముందుండేలా చేస్తాయి. హ్యూమ‌న్ క్యాపిట‌ల్ స్మార్ట్‌గా ఉండాలి, దూర‌దృష్టి క‌లిగి ఉండాలి. ఇది జాతీయ నాయ‌క‌త్వం ఏం ఆలోచిస్తోందో దానికి త‌గిన‌ట్లుగా మ‌నం ప‌రిష్కారాలు సూచించ‌గ‌ల‌గాలి, అప్పుడే మ‌నం యుద్ధాల్లో విజ‌యం సాధించ‌గ‌లం.

నేను మాట్లాడ‌డం మొద‌లుపెట్టేట‌ప్పుడు జై హింద్ అన్నాను. దానికి అర్థం మ‌న దేశానికి విజ‌యం రావాలని. ఆ విజ‌యం ఒలింపిక్‌ క్రీడ‌ల్లో కావ‌చ్చు, ఆర్థిక‌రంగంలో కావ‌చ్చు, విజ్ఞానంలో, టెక్నాల‌జీలో కావ‌చ్చు, యుద్ధాల్లోనైనా కావ‌చ్చు. చాలామంది సైన్యం అంటే యుద్ధాలు చేయ‌డానికే ఉంద‌నుకుంటారు. కానీ బ‌ల‌మైన సైన్యం యుద్ధాన్ని నివారిస్తుంద‌ని మీరంతా తెలుసుకోవాలి. బ‌ల‌మైన అంటే కేవ‌లం సంఖ్య‌లో కాదు.. సామ‌ర్థ్యంలో. ప్ర‌జ‌లు కావాల‌నుకున్న‌ప్పుడే సైన్యం యుద్ధానికి దిగుతుంది.

మ‌న‌మంతా దేశ‌మే ముందనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. మ‌న‌మంతా మ‌న‌లో విభేదాలు మ‌ర్చిపోయి, దేశం ముందుండాల‌ని తెలుసుకోవాలి. అప్పుడు మ‌న‌కు కేటాయించిన ల‌క్ష్యం.. విక‌సిత్ భార‌త్ 2047ను సుల‌భంగా సాధించ‌గ‌లం. ఇంకా ఆ ల‌క్ష్యాన్ని ప‌దేళ్ల ముందే చేరుకోగ‌లం. వింగ్ క‌మాండ‌ర్ చెప్పిన‌ట్లు ప్ర‌తి ఒక్క పౌరుడూ సైనికుడే’’ అని లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ వినోద్ జి. ఖండారే అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇంకా.. సిగ్మా అడ్వాన్స్‌డ్ సిస్ట‌మ్స్ భాగ‌స్వామి, డైరెక్ట‌ర్ మంకెన శ్రీ‌నివాస‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్ట‌ర్ సి. దామోద‌ర్ రెడ్డి, డైరెక్ట‌ర్లు సునీల్ కుమార్, మ‌ల్లెల సాయి, సంజ‌య్ కుమార్‌, ఇంద్ర‌జాల్ సీఓఓ ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి, ఢిల్లీ వ‌సంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)